ప్రారంభానికి ముందే సూపర్ స్టార్ డబుల్ ట్రీట్!
ఇది పూర్తయిన వెంటనే జైలర్ దర్శకుడితో జైలర్ -2 ప్రారంభించాలని రజనీ రెడీ అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయింది.
By: Tupaki Desk | 30 Nov 2024 11:30 AM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ప్రారంభానికి ముందే డబుల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారా? అందుకు 'జైలర్' మేకర్ నెల్సన్ తోడవుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్ 'కూలీ' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే జైలర్ దర్శకుడితో జైలర్ -2 ప్రారంభించాలని రజనీ రెడీ అవుతున్నారు. అయితే ప్రారంభానికి ముందే రజనీ లుక్ రెడీ అయింది.
ప్రముఖ స్టైలిస్ట్ అలీం హకీమ్ ఈ లుక్ డిజైన్ పూర్తి చేసినట్లు తెలిపారు. అతి త్వరలోనే సూపర్ స్టార్ కొత్త లుక్ చూస్తారంటూ ఇన్ స్టా వేదికగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 12 సూపర్ స్టార్ బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారు. ఆరోజునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటు సినిమాకి సంబంధించిన ఓ ప్రోమో టీజర్ ని కూడా సిద్దం చేస్తున్నారని సమాచారం.
అంటే ఒకేసారి అభిమానుల కోసం డబుల్ ట్రీట్ ప్లాన్ చేసినట్లు అన్న మాట. సినిమా ప్రారంభానికి ముందే ఇలాంటి ట్రీట్ చాలా రేర్ గా ఉంటుంది. రజనీకాంత్ అభిమానుల కోసం ఇలా ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొలవుతుందని సమాచారం. నెల్సన్ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన 'జైలర్' ఎలాంటి విజయం సాధించిందో తెలిసిందే.
రజనీకాంత్ కి చాలా కాలం తర్వాత పడిన మాస్ హిట్ అది. సూపర్ స్టార్ మ్యానరిజమ్ అంతే హైలైట్ అయింది. ఇందులో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ , జాకీ ష్రాఫ్, ఇలా స్టార్ హీరోలంతా నటించారు. మరి రెండవ భాగంలో స్టార్ హీరోల్ని రంగంలోకి దించుతారా? అన్నది చూడాలి.