Begin typing your search above and press return to search.

డి-ఏజింగ్ ఆ స్టార్ హీరోకి ఓ వ‌రం!

అయితే కొంత మంది న‌టుల‌కు మాత్రం డి-ఏజింగ్ అనేది ఓ వ‌రం లాంటింది. అందులో ప్ర‌ముఖంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 6:30 AM GMT
డి-ఏజింగ్ ఆ స్టార్ హీరోకి ఓ వ‌రం!
X

డి-ఏజింగ్ టెక్నాల‌జీ న‌టుల వ‌య‌సు త‌గ్గించి చూపించ‌డానికి మంచి సాధ‌నం. 60 ఏళ్ల న‌టుడిని 30, 20 ఏళ్ల వ‌య‌సుగ‌ల వారిలా మార్చ‌డానికి ఆ టెక్నాల‌జీ ఎంత‌గానో ఉప‌యోగ ప‌డుతుంది. ప్ర‌స్తుతం ఏఐ టెక్నాల‌జీ కూడా అందుబాటులో ఉండ‌టంతో డి-ఏజింగ్ మ‌రింత సుల‌భ‌త‌రం అయింది. ఇప్ప‌టికే డి-ఏజింగ్ టెక్నాల‌జీ చాలా మంది న‌టుల వ‌య‌సుల్ని త‌గ్గించి చూపించిన సంగ‌తి తెలిసిందే.

బాలీవుడ్ న‌టుడు షారుఖ్ ఖాన్ తన 'ప్యాన్' చిత్రంలో డి-ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగించిన మొదటి ప్రధాన తారలలో ఒకరుగా నిలిచారు. అందులో షారుక్ రోల్ ప‌ర్పెక్ట్ గా సెట్ అయింది. ఆ త‌ర్వాత 'ఆచార్య', 'డుంకీ',' కల్కి 2898 AD', ఇటీవ రిలీజ్ అయిన 'గోట్' లాంటి సినిమాల‌కు ఇదే టెక్నాల‌జీ వాడారు. కానీ గోట్ విష‌యంలో విజ‌య్ పాత్ర ప‌రంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

యూత్ ఫుల్ లుక్ కోసం విజ‌య్ ని 20 ఏళ్ల యువ‌కుడిగా ఆవిష్క‌రించిన తీరుపై చాలా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ పాత్ర‌కు అంత‌గా సూట్ అవ్వ‌లేద‌న విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. వాస్త‌వానికి ప్ర‌చార చిత్రాల స‌మ‌యంలో విజ‌య్ లుక్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆ పాత్ర రిలీజ్ స‌మ‌యానికి అంత‌గా క‌నెక్ట్ కాలేదు. ఇక రిలీజ్ త‌ర్వాత సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్య‌యాయి.

అయితే కొంత మంది న‌టుల‌కు మాత్రం డి-ఏజింగ్ అనేది ఓ వ‌రం లాంటింది. అందులో ప్ర‌ముఖంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని చెప్పొచ్చు. 70 ఏళ్ల పైబ‌డిన ర‌జ‌నీకాంత్ ని 40 ఏళ్ల వ‌య‌స్కుడిగా చూపించినా ఆడియ‌న్స్ ఆ ఆపాత్ర‌కు ఇట్టే క‌నెక్ట్ అవుతారు. ఎలాంటి విగ్గులు ధ‌రించినా ర‌జ‌నీకా సూప‌ర్బ్ గా సెట్ అవుతుంటాయి. ర‌జ‌నీకాంత్ రియ‌ల్ లైఫ్ లో వృద్ధాప్యం కొట్టొచ్చిన‌ట్లు కినిపిస్తుంది.

ఎంతో బ‌ల‌హీనంగానూ క‌నిపిస్తారు. కానీ ఆన్ స్క్రీన్ పై వ‌చ్చేస‌రికి అత‌డి లుక్ పూర్తిగా మారిపోతుంది. 30 ఏళ్ల యువ‌కుడి ఎన‌ర్జీని త‌ట్టి లేపుతారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన వెట్టేయాన్ ప్ర‌చార చిత్రాల్లో అత‌డి లుక్ ఆక‌ట్టుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా డి-ఏజింగ్ అనేది ర‌జ‌నీకాంత్ లాంటి వారికి ఓ వ‌రం లాంటిదే.