Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ అప్‌డేట్‌

ప్రస్తుతం మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ చేస్తున్న రజినీకాంత్‌ ఆ తర్వాత జైలర్‌ 2 సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Sep 2024 12:30 PM GMT
సూపర్‌ స్టార్‌ సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ అప్‌డేట్‌
X

తమిళ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ చాలా ఏళ్ల తర్వాత 'జైలర్‌' సినిమాతో సూపర్‌ హిట్‌ దక్కించుకున్నాడు. రజినీకాంత్‌ కెరీర్‌ లోనే బిగ్గెస్ట్‌ మూవీగా జైలర్ నిలిచింది. బాక్సాఫీస్‌ వర్గాల టాక్‌ అనుసారం జైలర్ సినిమా రూ.700 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. రజినీకాంత్‌ కెరీర్ ఖతం అయింది అనుకుంటున్న సమయంలో జైలర్‌ వచ్చి మళ్లీ ఆయన పుంజుకునేలా చేసింది. వయసు తగ్గ పాత్ర తో జైలర్ లో రజినీకాంత్‌ అలరించాడు. ప్రస్తుతం మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ చేస్తున్న రజినీకాంత్‌ ఆ తర్వాత జైలర్‌ 2 సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయి.

గత కొన్ని రోజులుగా జైలర్‌ సినిమాకు సీక్వెల్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలోనే దర్శకుడు సీక్వెల్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రకటించాడు. రజినీకాంత్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావాల్సి ఉందని పేర్కొన్నాడు. తాజాగా జైలర్ 2 నుంచి కీలక అప్డేట్‌ వచ్చింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ జైలర్‌ సీక్వెల్‌ కోసం కథ రెడీ చేశాడట. ఇప్పటికే ఏ పాయింట్‌ తో కథను కొనసాగించాలి అనే విషయమై దర్శకుడు నెల్సన్‌ ఒక నిర్ణయానికి వచ్చాడని, రజినీకాంత్‌ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్‌ దక్కినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

జైలర్ సీక్వెల్‌ కోసం సుదీర్ఘ చర్చలు జరిగాయి. అతి త్వరలోనే నిర్మాణ సంస్థ నుంచి అతి పెద్ద ప్రకటన రాబోతున్నట్లు నెల్సన్‌ దిలీప్ ప్రకటించాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ ప్రకటన కోసం రజినీకాంత్‌ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు వెయిట్‌ చేయండి అన్నాడు. వచ్చే నెలలోనే జైలర్‌ 2 సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా నెల్సన్‌ దిలీప్ చేసిన ప్రకారం షూటింగ్ ప్రారంభం కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం టిజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ 'వేట్టయాన్‌' సినిమాను చేస్తున్నాడు. షూటింగ్‌ ముగింపు దశలో ఉన్న ఆ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' అనే సినిమాను రజినీకాంత్‌ చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతోంది. మరో వైపు లైకా ప్రొడక్షన్స్ లో రజినీకాంత్‌ ఒక భారీ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సినిమాలు రజినీకాంత్‌ చేస్తున్నా 'జైలర్‌ 2' పైనే అందరి చూపు ఉంది. వందల కోట్ల వసూళ్లు సాధించిన జైలర్‌ సీక్వెల్‌ అదే స్థాయి లో వసూళ్లు సాధిస్తుందేమో చూడాలంటే వచ్చే ఏడాది వరకు వెయిట్‌ చేయాల్సిందే.