సూపర్ స్టార్ సినిమాను పట్టించుకోరేంటి..!
ఆ తర్వాత మలయాళంలో చేసిన లూసిఫర్ అక్కడ సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాను తెలుగులో కూడా అనువదించి రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 20 Jan 2024 2:30 AM GMTఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన మోహన్ లాల్ కి కేవలం మలయాళంలోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉంది. మలయాళ సీనియర్ స్టార్ గా ఆయన చేస్తున్న సినిమాలు అక్కడ బాక్సాఫీస్ పై మంచి ఫలితాలు అందిస్తున్నాయి. మన దగ్గర కూడా 90వ దశకంలో మోహన్ లాల్ డబ్బింగ్ సినిమాలు ఆకట్టుకున్నాయి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనమంతా సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమా చేసిన మోహన్ లాల్ ఆ సినిమాతో ఆశించిన ఫలితం అందుకోలేదు కానీ ఎన్.టి.ఆర్ తో చేసిన జనతా గ్యారేజ్ సినిమా మాత్రం సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత మలయాళంలో చేసిన లూసిఫర్ అక్కడ సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాను తెలుగులో కూడా అనువదించి రిలీజ్ చేశారు. ఆ సినిమాకు కూడా తెలుగు ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇక లేటెస్ట్ గా మలైకొట్టయి వాలిబన్ అనే సినిమా చేశారు మోహన్ లాల్. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో జనవరి 25న రిలీజ్ చేస్తున్నారు.
లిజో జోస్ పెల్లిషెర్రీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తే విజువల్ గ్రాండియర్ గా అనిపిస్తుంది. అయితే ఈ సినిమా తెలుగు రిలీజ్ ని అంతగా పట్టించుకోవట్లేదు ఆడియన్స్. సంక్రాంతికి మిస్ అయ్యిందని జనవరి 25నే ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. హృతిక్ రోషన్ ఫైటర్ కూడా ఆరోజు రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల మధ్య మోహన్ లాల్ సినిమా ఎక్కడ కనిపించట్లేదు.
మోహన్ లాల్ సోలో రిలీజ్ లకు తెలుగులో పెద్దగా క్రేజ్ రావట్లేదు. అందుకే రాబోతున్న ఈ సినిమాకు కూడా ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. ఇదే కాకుండా సంక్రాంతి సినిమాల సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటి మధ్యలో మలైకొట్టై వాలిబన్ సినిమా ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. ఈ సినిమా తెలుగులో భారీగా రిలీజ్ చేస్తే హైదరాబాద్ వచ్చి ప్రమోట్ చేసేందుకు మోహన్ లాల్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే తెలుగు ఆడియన్స్ ఆ సినిమా మీద ఆసక్తి చూపిస్తారు కానీ ఎలాంటి బజ్ లేకపోతే మాత్రం సినిమాను ఆదరించడం కష్టం. మరి మోహన్ లాల్ సినిమా తెలుగు రిలీజ్ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.