Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా లేకున్నా ఇది మహేష్ రేంజ్

అలాగే పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఒక్క స్పైడర్ మూవీ మాత్రమే తెలుగు, తమిళ్ భాషలలో ఇక కాలంలో తెరకెక్కింది

By:  Tupaki Desk   |   20 Sep 2023 3:52 AM
పాన్ ఇండియా లేకున్నా ఇది మహేష్ రేంజ్
X

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఇప్పటి వరకు ఒక్క రీమేక్ సినిమాలో నటించలేదు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలు ఇప్పటి వరకు రాలేదు. ఒక్క స్పైడర్ మూవీ మాత్రమే తెలుగు, తమిళ్ భాషలలో ఇక కాలంలో తెరకెక్కింది. తరువాత మళ్ళీ తెలుగుకే పరిమితం అయిపోయాడు. అయితే తెలుగులో హైయెస్ట్ మార్కెట్ వేల్యూ ఉన్న హీరోల జాబితాలో మహేష్ బాబు మొదటి స్థానంలో ఉంటాడని చెప్పొచ్చు.

శ్రీ మంతుడు నుంచి మహేష్ బాబు మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. సునాయాసంగా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ ని మహేష్ బాబు సినిమాలు అందుకుంటున్నాయి. మేగ్జిమమ్ అన్ని సూపర్ హిట్ సినిమాలే అతని నుంచి వచ్చాయి. అలాగే సూపర్ స్టార్ తో సినిమా అంటే కనీసం 150 కోట్ల బడ్జెట్ సిద్ధం చేసుకోవాల్సిందే. ఆ స్థాయిలో మార్కెట్ వేల్యూ మహేష్ బాబుపైన ఉంది.

పాన్ ఇండియా బ్రాండ్ లేకుండా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడని చెప్పొచ్చు. అతను ఒక్కో సినిమాకి 75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఇది కేవలం రెమ్యునరేషన్ మాత్రమే. తరువాత మూవీ సక్సెస్ బట్టి లాభాల్లో వాటాలు కూడా తీసుకుంటున్నాడు. అతను హీరోగా చేస్తోన్న సినిమాలకి మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా కూడా ఉంటున్నాడు.

అలా మూవీ లాభాల్లో వాటాల ద్వారా ఇంకా ఎక్కువగానే గిట్టుబాటు అవుతోంది. తక్కువలో తక్కువగా 75 కోట్ల వరకు అతనికి రెమ్యునరేషన్ క్రింద వస్తూ ఉండటం విశేషం. ఇండియాలో ఏ ఇతర హీరోలకి కూడా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడం లేదు. ఒక్క పాన్ ఇండియా బ్రాండ్ ఉన్న స్టార్స్ మాత్రమే 70 నుంచి 100 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నారు. ప్రభాస్ అత్యధికంగా 100 కోట్లకి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామ్యం లేకుండా 75 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ చిత్రానికి అప్పుడే నాన్ థీయాట్రికల్ బిజినెస్ స్టార్ట్ అయినట్లు సమాచారం.