Begin typing your search above and press return to search.

గుంటూరు కారం.. ఫ్యాన్స్​ హర్టింగ్​ న్యూస్​.. సర్​ప్రైజ్​ క్యాన్సిల్​

కానీ ఇప్పటివరకు ఎటువంటి సాంగ్​ కూడా రిలీజ్ అవ్వలేదు. మొదట మహేశ్​బాబు పుట్టినరోజుకు విడుదల చేస్తారని టాక్ వచ్చింది

By:  Tupaki Desk   |   13 Sep 2023 11:42 AM GMT
గుంటూరు కారం.. ఫ్యాన్స్​ హర్టింగ్​ న్యూస్​..  సర్​ప్రైజ్​ క్యాన్సిల్​
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చేలా షెడ్యూళ్లను రెడీ చేసుకుని చిత్రీకరణ జరుపుతున్నారట​. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్​ను హర్ట్ చేసే వార్త ఒకటి బయటకు వచ్చింది.

గుంటూరు కారం సినిమాను మ్యూజికల్​గా చార్ట్ బస్టర్ హిట్ చేసేందుకు మూవీటీమ్​ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పర్ఫెక్ట్ కమర్షియల్ ఆల్బమ్​లా సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్​ రిలీజ్ చేస్తారనే చాలా రోజుల నుంచి ప్రచారం సాగుతుంది.

కానీ ఇప్పటివరకు ఎటువంటి సాంగ్​ కూడా రిలీజ్ అవ్వలేదు. మొదట మహేశ్​బాబు పుట్టినరోజుకు విడుదల చేస్తారని టాక్ వచ్చింది. కానీ అవ్వలేదు. రీసెంట్​గా వినాయక చవితికి(సెప్టెంబర్ 18) రిలీజ్ చేస్తారని అన్నారు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఇది కూడా అయ్యేట్టు కనపడట్లేదు. ఎందుకంటే సాంగ్ ఇంకా రెడీ అవ్వలేదట.

దీంతో వినాయక చవితికి సాంగ్ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంకా సాంగ్​కు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయని సమాచారం అందింది. ప్రస్తుతం హైదరాబాద్​ కోఠిలో షూటింగ్ జరుగుతుందట. ఎంతో కాలం సాంగ్ కోసం ఎదురుచూస్తున్న మహేశ్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్త అనే చెప్పాలి. చూడాలి మరి ఎప్పుడు ఫస్ట్ సింగిల్​ రిలీజ్ చేస్తారో..

ఇకపోతే ఈ చిత్రంలో మొత్తంగా 4 నుంచి 5 పాటలు, రెండు థీమ్స్ సాంగ్స్ ఉంటాయని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. ఇందులోనే ఓ డ్యుయెట్ సాంగ్ కూడా ఉంటుందని అంటున్నారు. ఫైనల్​గా అయితే కచ్చితంగా చిత్రంలో రెండు మెయిన్ సాంగ్స్, ఓ థీమ్ సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారట. ఓ సాంగ్​.. మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్​ను ఎలివేట్ చేస్తూ లిరిక్స్ రాసి అద్భుతమైన విజువల్స్తో తెరకెక్కిస్తున్నారని కూడా ఆ మధ్యలో టాక్ వినిపించింది. ఇక స్పెషల్ సాంగ్​ అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్​లో ప్లాన్ చేస్తున్నారని అన్నారు.