Begin typing your search above and press return to search.

ముంబైలో సూపర్ స్టార్.. ఈ లుక్కుతో ఎక్కడికి?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది

By:  Tupaki Desk   |   12 July 2024 8:11 AM GMT
ముంబైలో సూపర్ స్టార్.. ఈ లుక్కుతో ఎక్కడికి?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా కోసం రెడీ అవుతున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా ఈ చిత్రంలో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఆ క్యారెక్టర్ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు. కొంతకాలంగా లండన్ లో ఉన్న మహేష్ బాబు క్యారెక్టర్ లుక్ కి సరిపోయే విధంగా రెడీ అయ్యి వచ్చాడు.

లాంగ్ హెయిర్ స్టైల్, గడ్డం, స్టైలిష్ మీసకట్టుతో మహేష్ బాబు సరికొత్తగా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో SSMB29 వర్క్ షాప్ మొదలు కాబోతోందంట. ఈ వర్క్ షాప్ లో మహేష్ బాబు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముంబైలో మహేష్ బాబు మీడియా కంటికి చిక్కారు.

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో గ్రాండ్ గా జరగబోతోంది. ఈ వేడుక కోసం ఇప్పటికే టాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముంబై వెళ్లారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అటెండ్ అవ్వబోతున్నారు. పెళ్లి వేడుక కోసం మహేష్ బాబు ముంబైలో దిగారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అతని ఫోటోలని క్లిక్ మనిపించారు.

టీషర్ట్, జీన్ ప్యాంట్ వేసుకొని బ్లాక్ కళ్ళజోడు, తలపైన టోపీ పెట్టుకొని స్టైలిష్ కి కేరాఫ్ గా మహేష్ బాబు ఈ లుక్ లో కనిపిస్తున్నాడు. యంగ్ కుర్రాడిలా మహేష్ బాబు ఈ అవుట్ ఫిట్ లో ఎట్రాక్ట్ చేస్తూ ఉండటం విశేషం. ఇదే లుక్ SSMB29 సినిమాలో కూడా ఉంటే హాలీవుడ్ లెవల్ లో ఫ్యాన్స్ ని సంపాదించుకోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ సైతం అందం విషయంలో మహేష్ బాబుని అస్సలు డామినేట్ చేయరని అతని అభిమానులు అంటున్నారు.

ఇక అనంత్ అంబానీ పెళ్లి వేడుకకి తెలుగు రాష్ట్రాల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులకి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సైతం ఈ పెళ్లికి వెళ్ళబోతున్నట్లు సమాచారం. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సైతం ఆహ్వానం అందిందంట.