దేవుడి చేతుల్లో సూపర్ స్టార్ గవర్నర్ పోస్ట్!
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతుంది.
By: Tupaki Desk | 4 Sep 2023 2:30 PM GMTసూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా? రారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసాగుతుంది. ఆయన రావడం లేదని ప్రకటించినా రాజకీయ పరిణామాలు మాత్రం ఆ వ్యాఖ్యల్ని నమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే డైలమాలో పడేస్తున్నాయి. కళా..సేవారంగాల్లో ఆయనను గుర్తించి తమిళనాడు రాష్ట్ర గవర్నర్ బాధ్యతలైనా ఆయనకు అప్పగించే అవకాశం ఉందని చాలా కాలంగా మీడియాలో ప్రచారం సాగుతుంది. ఈప్రచారం కూడా రజనీ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తాజాగా మరోసారి కాబోయే గవర్నర్ రజనీ అంటూ తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై రజనీ సోదరుడు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. `రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉంది. అలాగని ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆశించాల్సిన పనిలేదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదు. ఇలాంటి సమావేశాల్లో పాల్గొనడం సహజంగా జరుగుతుంది. కేవలం రాజకీయాల కోసమే భేటి అంటే పొరబడినట్లే` అని అన్నారు.
ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన సూపర్‌స్టార్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడంతో గవర్నర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రజనీ ఇలా ముఖ్యమంత్రులని కలవడం వెనుక రాజకీయ కోణం ఉందని విశ్లేషకుల భావిస్తున్నారు. లేకపోతే ఎన్నడు లేనిది రజనీకాంత్ ఇప్పుడు పనిగట్టుకుని ఎందుకు కలుస్తున్నారని బలమైన బాణి మరోవైపు వినిపిస్తుంది.
రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చకు దారి తీసింది. అయితే రజనీ ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. మరి రజనీ మనసులో ఏముందో ఆయ వెల్లడిస్తే గానీ క్లారిటీ రాదు. ప్రస్తుతం రజనీకాంత సీరియస్ గా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన `జైలర్` బ్లాక్ బస్టర అయిన సంగతి తెలిసిందే. ఇదే ఉత్సాహంలో తదుపరి చిత్రాలపైనా ఫోకస్ పెడుతున్నారు.