Begin typing your search above and press return to search.

'కఠిన చర్యలు తీసుకోవద్దు'.. మోహన్ బాబుకు రిలీఫ్!

జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

By:  Tupaki Desk   |   9 Jan 2025 7:41 AM GMT
కఠిన చర్యలు తీసుకోవద్దు.. మోహన్  బాబుకు రిలీఫ్!
X

మంచు ఫ్యామిలీలో రగడ సందర్భంగా జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు మోహన్ బాబుపై తొలుత బీ.ఎన్.ఎస్. 118 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేయగా.. అనంతరం లీగల్ ఒపీనియన్ తీసుకున్న పోలీసులు.. సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

దీంతో.. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ ను డిసెంబర్ 23న తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో.. దాన్ని సవాలు చేస్తూ ఆయన సుర్పీంకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టులో దాడి కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనకు ఊరట లభించింది.

అవును... జర్నలిస్టుపై దాడి కేసులో సినీనటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఎలాంటి కఠిన చర్యలూ తీసుకొవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో.. తదుపరి విచారణను నాలుగు వరాలకు వాయిదా వేస్తూ.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఈ సందర్భంగా సుప్రీంలో మోహన్ బాబు తరుపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఈ సమయంలో.. కొడుకుతో గొడవల సందర్భంగా ఈ ఘటన జరిగిందని.. జర్నలిస్టులు బలవంతంగా ఇంట్లోకి వచ్చిన క్రమంలో ఈ దాడి జరిగిందే తప్ప కావాలని చేయలేదని.. ఇప్పటికే జర్నలిస్టుకు బహిరంగ క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారని తెలుస్తోంది.

ఇదే సమయంలో నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని మోహన్ బాబు తరుపు న్యాయవాది వాదనలు వినిపించారని అంటున్నారు. మరోపక్క జర్నలిస్టు తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది.. దాడి జరగడంతో బాధితుడు ఐదు రోజులు ఆస్పత్రిలో ఉన్నారని.. సర్జరీ తర్వాత సుమారు నెల రోజులు పైపూ ద్వారానే ఆహారం తీసుకున్నారని తెలిపినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా, కించపరిచినట్లు మాట్లాడారని.. అతనికి ప్రొఫెషనల్ గా తీవ్ర నష్టం జరిగిందని న్యాయవాది కోర్టుకు విన్నవించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన సుప్రీంకోర్టు... తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ మోహన్ బాబు పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోవద్దని ఆదేశించింది!