Begin typing your search above and press return to search.

ప్రభాస్ బర్త్ డే.. గుడ్ న్యూస్ ఏమిటంటే..

ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలు 4K లో చక్రం, ఈశ్వర్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Oct 2024 2:22 PM GMT
ప్రభాస్ బర్త్ డే.. గుడ్ న్యూస్ ఏమిటంటే..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 45వ పుట్టినరోజు ఈ నెల 23వ తేదీన జరగబోతోంది. ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా ప్రభాస్ పుట్టినరోజున భారీగా ట్రీట్స్ అందబోతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న పలు ప్రాజెక్ట్స్ నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలు 4K లో చక్రం, ఈశ్వర్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి.

ఇక ప్రభాస్ లైనప్ లో జనాల ఫోకస్ స్పిరిట్ పైనే ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమా నుండి ఒక స్పెషల్ ఆడియో గ్లింప్స్‌ను అక్టోబర్ 23వ తేదీన విడుదల చేయనున్నారని టాక్ వస్తోంది. ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతుంది. ప్రభాస్ కెరీర్‌లో మొదటిసారి ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అక్టోబర్ 20 వ తేదీకి ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మరో అప్డేట్ ఫౌజీ ప్రాజెక్ట్‌కు సంబంధించినది. ఈ సినిమా ఫస్ట్ లుక్ అదే రోజు వచ్చే అవకాశం ఉందట. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వార్ డ్రామా పై మంచి హైప్ ఉంది. ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ ఇండియన్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక అభిమానులను మరింత ఉత్సాహపరచబోయే అంశం రాజాసాబ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ విడుదలపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండటంతో ప్రతీ అప్డేట్ పట్ల ప్రేక్షకుల్లో ఉత్సాహం పెరుగుతోంది. రాజాసాబ్ టీజర్ లేదా సాంగ్ కూడా అక్టోబర్ 23 న విడుదల కానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూడు ప్రాజెక్ట్‌ల నుండి అప్డేట్స్ రావడం కచ్చితంగా ఆయన అభిమానులకు పండగే. స్పిరిట్, ఫౌజీ, రాజాసాబ్ లాంటి డిఫరెంట్ భారీ ప్రాజెక్ట్స్ పై మొత్తంగా వెయ్యి కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి సినిమాలపైనా ప్రేక్షకుల అంచనాలు మామూలుగా లేవు.