Begin typing your search above and press return to search.

ట్రెడిషన్‌కి ట్రెండ్ టచ్.. సుప్రీత స్టన్నింగ్ పిక్

చీర అందాల్ని సొగసుగా ఒలకబోస్తూ బిర్లా మందిర్ ఆవరణంలో తీరికగా నడుస్తూ కనిపించిన సుప్రీత, సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది.

By:  Tupaki Desk   |   10 Nov 2024 2:30 AM GMT
ట్రెడిషన్‌కి ట్రెండ్ టచ్.. సుప్రీత స్టన్నింగ్ పిక్
X

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు సోషల్ మీడియా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటోంది. ఇక ఈమధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు కూడా మరోసారి వైరల్ గా మారాయి. హైదరాబాదు బిర్లా మందిర్‌ దగ్గర తీసిన కొన్ని ఫోటోలతో తన ఫ్యాన్స్‌ను మరింతగా ఆకట్టుకుంది. చీరలో ప్రత్యేకమైన అందాన్ని హైలెట్ చేస్తూ నవ్వుతోనే మాయ చేసేసింది.

గ్లామర్ తో పాటు సాంప్రదాయాల కలయికతో నిండి ఉన్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చీర అందాల్ని సొగసుగా ఒలకబోస్తూ బిర్లా మందిర్ ఆవరణంలో తీరికగా నడుస్తూ కనిపించిన సుప్రీత, సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలో ఆమె వేసుకున్న లైట్ పింక్ చీర, క్లాసీ జ్యూవెలరీతో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వడంతో ఫ్యాన్స్ పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.

ఆమె లుక్ ప్రత్యేకమైన చారిత్రాత్మక స్థానంలో మరింత అందంగా నిలిచింది. హైదరాబాదు రాత్రి వెలుగుల్లో బిర్లా మందిరం సౌందర్యం, సుప్రీత రూపం కలిసి, పిక్స్‌లో విశిష్టమైన లుక్ క్రియేట్ అయ్యింది. ఇక ఎక్కువగా తల్లి సురేఖ వాణితో కలిసి అనేక పబ్లిక్ ఈవెంట్స్‌లో కనబడుతూ, గ్లామరస్ లుక్స్ తో అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.

అయితే, సుప్రీత కేవలం తల్లి సురేఖ వాణి కూతురుగా మాత్రమే కాదు, తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను తెచ్చుకుంది. చిన్న వయసులోనే సోషల్ మీడియా ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించింది. ముఖ్యంగా తన ఫ్యాషన్ స్టైల్ తో పాటు, గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ యూత్ ను మెస్మరైజ్ చేస్తోంది. త్వరలోనే హీరోయిన్ గా డెబ్యూ చేయబోతున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం తన మొదటి సినిమాలో నటిస్తూ మరిన్ని కొత్త అవకాశాలు అందుకుంటుంది.