Begin typing your search above and press return to search.

సుప్రీత పాప.. ఆ నవ్వు చాలు ఫ్లాట్ అవ్వడానికి!

సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   11 May 2024 3:30 PM GMT
సుప్రీత పాప.. ఆ నవ్వు చాలు ఫ్లాట్ అవ్వడానికి!
X

టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖ వాణి పక్కాగా ముందు వరుసలో ఉంటుంది. ఎన్నో తెలుగు సినిమాల్లో తల్లిగా, ఆంటీగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. స్టార్ హీరో చిత్రాల్లో ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటోంది. అప్పుడప్పుడు గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంటోంది. ఫ్యాన్స్ షాకయ్యేలా పోజులు ఇస్తుంటోంది.


ఇక సురేఖ వాణి కూతురు సుప్రీత ఫోటోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రకారు మతులు పోగొడుతుంటోంది. రకరకాల స్టిల్స్ తో అందాలు ఆరబోసి.. హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తోంది. ఇప్పటికే డెబ్యూ మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది సుప్రీత. 'ఆమె ఒక రాణి.. ఆమె సోల్ రాయల్టీ' అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. స్కై బ్లూ కలర్ ఫ్లోరల్ గాగ్రాలో అదరగొట్టేసింది. స్కిన్ షో చేయకపోయినా.. ట్రెడిషనల్ గా ఆకట్టుకుంటోంది. తన నవ్వుతోనే అందరినీ మాయ చేస్తోంది. వయ్యారంగా నిల్చుని ఫిదా చేస్తోంది. క్రేజీ నెక్ సెట్.. ఆమె అందాన్ని మరింత పెంచింది. ప్రస్తుతం సుప్రీత నయా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఏ డ్రెస్ లో అయినా సుప్రీత అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. స్టార్ హీరోయిన్ అవ్వడం పక్కా అని జోస్యం చెబుతున్నారు. ఫస్ట్ మూవీ కోసం వెయిటింగ్ అంటూ సందడి చేస్తున్నారు. అందానికి ఇమేజ్ అంటూ బ్యూటీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ నవ్వుకే క్లీన్ బౌల్డ్ అయ్యామని కుర్రాళ్లు చెబుతున్నారు. అలా చూస్తుంటే.. చూడాలనిపించే మ్యాజిక్ ఆమెలో ఉందని రచ్చ రచ్చ చేస్తున్నారు.


ఇక సుప్రీత డెబ్యూ సినిమా విషయానికొస్తే.. బిగ్‌ బాస్ లేటెస్ట్ సీజన్ రన్నరప్ అమర్ దీప్ సరసన నటిస్తోంది. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ ను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటోంది. కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి 1.45 గంటలకు షూట్ చేస్తున్నట్లు పోస్ట్ చేసింది. మరి సురేఖ స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినట్టు.. సుప్రీత టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.