Begin typing your search above and press return to search.

సమ్మర్ లో సుప్రీత ఫుల్ చిల్.. గ్లాస్ పట్టుకుని..

సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలు పాపులర్ అవుతుంటారు. మంచి ఫేమ్ సంపాదించుకుంటారు

By:  Tupaki Desk   |   5 May 2024 7:05 PM GMT
సమ్మర్ లో సుప్రీత ఫుల్ చిల్.. గ్లాస్ పట్టుకుని..
X

సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలు పాపులర్ అవుతుంటారు. మంచి ఫేమ్ సంపాదించుకుంటారు. కానీ కొందరు మాత్రం సెన్సేషనల్ కిడ్స్ గా మారుతుంటారు. వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఒకరు. టీనేజ్ లోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. త్వరలో హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం డెబ్యూ చిత్రంలో నటిస్తోంది. అందుకు బాగా కష్టపడుతుంది కూడా.

చిన్న వయసులోనే సుప్రీతకు ఓ రేంజ్ లో క్రేజ్ రావడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే. అందుకే ఈ అమ్మడు నెట్టింట యమా యాక్టివ్‌ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్స్ కూడా నిర్వహిస్తుంటోంది. ఇటీవల ఏ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకుంటారని అడగ్గా.. విజయ్ దేవరకొండ అని చెప్పి షాక్ ఇచ్చింది.

ఇక తన తల్లి సురేఖ వాణితో కలిసి సుప్రీత చేసే సందడి మామూలుగా ఉండదు. డిన్నర్ పార్టీలకు వెళ్తూ అక్కడి ఫొటోస్ దిగి వెంటనే ఇద్దరూ అప్లోడ్ చేస్తుంటారు. వీలు దొరికితే చాలు.. ఫారిన్ ట్రిప్ కు వెళ్తుంటారు. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఎప్పటికప్పుడు వెకేషన్ కు వెళ్తూనే ఉంటారు తల్లీకూతుళ్లు. తాజాగా సుప్రీత.. నెట్టింట కొత్త పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బీచ్ దగ్గర సూర్యాస్తమయం టైమ్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది సుప్రీత. చేతిలో గ్లాస్ పట్టుకుని పోజులు ఇచ్చింది. వైట్ కలర్ మినీ స్కర్ట్ లో అందాలు ఆరబోసింది. ఎద అందాలతో కవ్విస్తూనే థైస్ షో కూడా చేసింది. ప్రస్తుతం సుప్రీత కొత్త పిక్స్ దెబ్బకు సోషల్ మీడియా వేడెక్కిపోయింది! మండే వేసవిలో అమ్మడు తన లుక్స్ తోనే సెగలు పుట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఓ రేంజ్ లో లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ఇక సుప్రీత డెబ్యూ మూవీ విషయానికొస్తే.. బిగ్‌ బాస్ ఫేమ్ అమర్ దీప్ కు జోడీగా నటిస్తోంది. లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటోంది. ఇటీవల అర్ధరాత్రి 1.45 గంటలకు షూట్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టింది. మరి టాలీవుడ్ లో సురేఖ వాణి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినట్టు.. సుప్రీత ఫ్యూచర్ లో స్టార్ హీరోయిన్ అవుతుందో లేదో చూడాలి.