Begin typing your search above and press return to search.

సింగిల్ షాట్ లో 18 నిమిషాల సీన్

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గురించి సూరజ్ ఇంటరెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   20 Oct 2024 7:54 AM GMT
సింగిల్ షాట్ లో 18 నిమిషాల సీన్
X

కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. క్యారెక్టర్ కోసం ఎలా నటించడానికి అయిన రెడీగా ఉండే నటులలో విక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. తన లుక్స్ ని అవలీలగా మార్చేసుకొని సినిమాలు చేయడంలో విక్రమ్ దిట్ట. ‘ఐ’ సినిమాలో అయితే సన్నగా, బాడీ బిల్డర్, కురూపిగా డిఫరెంట్ లుక్స్ లో కనిపించి మెప్పించాడు. ఆ పాత్రల కోసం ఏకంగా ఫుడ్ తీసుకోవడం కూడా విక్రమ్ మానేసాడు.

ఇక రీసెంట్ గా పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘తంగలాన్’ సినిమాలో విక్రమ్ కేవలం గోచితో నటించాడు. అలాగే నేచురల్ లుక్ కోసం గంటల తరబడి ఎండలో ఉన్నాడు. స్లిమ్ అయ్యాడు. ‘తంగలాన్’ మూవీ చూసినపుడు అందులో పాత్ర మాత్రమే కనిపిస్తుంది తప్ప విక్రమ్ ఎక్కడా కనిపించడు. అదే విక్రమ్ ప్రత్యేకత. అందుకే విలక్షణ నటుడిగా అతనికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది.

ఇదిలా ఉంటే విక్రమ్ ప్రస్తుతం ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ మూవీ చేస్తున్నాడు. సిద్ధార్ధ్ హీరోగా తెరకెక్కిన ‘చిన్ని’ మూవీతో దర్శకుడిగా అతను సక్సెస్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ప్రస్తుతం ‘వీర ధీర సూరన్ 2’ చిత్రాన్ని అరుణ్ కుమార్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. దూషారా విజయన్ ఈ చిత్రంలో విక్రమ్ కి జోడీగా నటిస్తోంది.

ఎస్ జె సూర్య ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. మలయాళీ యాక్టర్ సూరజ్ ఈ చిత్రంలో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గురించి సూరజ్ ఇంటరెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. మూవీలో పోలీస్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ లో విక్రమ్, ఎస్ జె సూర్యతో కలిసి ఒక సీన్ లో నటించానని, ఇది నా లైఫ్ లో మెమొరబుల్ సన్నివేశం అన్ని పేర్కొన్నారు. ఏకంగా 18 నిమిషాలు సింగిల్ షాట్ లో ఆ సన్నివేశం చేయడం జరిగిందని అన్నారు.

నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి సుదీర్ఘ సన్నివేశాన్ని సింగిల్ షాట్ లో చేయలేదని తెలిపారు. ఈ సన్నివేశం తెరపై ఎలా ఉంటుందో చూడాలనే క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నట్లు సూరజ్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సినిమాపైన కూడా అంచనాలు పెరిగాయి. విక్రమ్ ఒక మాస్ కథాంశంతో మూవీ చేస్తే కచ్చితంగా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. మరి ‘వీర ధీర సూరన్ పార్ట్ 2’ తో విక్రమ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.