Begin typing your search above and press return to search.

సురేఖవాణి.. స్విమ్మింగ్ పూల్ లో హై గ్లామర్

ఇక ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ లో అమ్మడు పూల్ లో మరింత గ్లామర్ గా కనిపించింది. ఇక సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే వార్తలు వైరల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:30 PM GMT
సురేఖవాణి.. స్విమ్మింగ్ పూల్ లో హై గ్లామర్
X

ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న సురేఖ వాణి ఇప్పుడు మాత్రం అల్ట్రా స్టైలిష్ గా సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చూసినా కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో నిమిషాల్లో వైరల్ అవ్వాల్సిందే. ఇక ఆమెకు రెండు పదుల వయసున్న కూతురు ఉన్నప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ల అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

సురేఖ వాణి ప్రతిసారి కూడా తన గ్లామర్ తో ఫాలోవర్స్ ను అంతకుమించి పెంచుకుంటూనే ఉంది. ఇక రీసెంట్ గా ఆమె షేర్ చేసిన పాత వీడియో కి సంబందించిన ఫొటోస్ కూడా మరోసారి షాక్ అయ్యేలా వైరల్ అవ్వుతున్నాయి . స్విమ్మింగ్ పూల్ లో చాలా హ్యాపీగా నవ్వుతూ కూతురు తీసిన వీడియోస్ కు స్టిల్ ఇచ్చింది. ఇక ఈ పాత వీడియో కూడా మరొకసారి సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వుతుంది . సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలను నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం భాషలో కూడా ఆమెకు అవకాశాలు వచ్చాయి. ఇక సినిమా అవకాశాలు వస్తున్నా రాకపోయినా కూడా ఆమె మాత్రం సోషల్ మీడియాలో చాలా బిజీగా కనిపిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ కు ఈ తరహా ట్రీట్ ఇస్తూ ఉనికిని చాటుకుంటుంది.

ఇక ఇప్పుడు ఈ బ్లాక్ డ్రెస్ లో అమ్మడు పూల్ లో మరింత గ్లామర్ గా కనిపించింది. ఇక సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోందని గతంలోనే వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా ఆమె ఆ విషయంపై సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయినా నేను ఇప్పుడు నేను రెండో పెళ్లి చేసుకుంటే తప్పు ఏమిటి అనే విధంగా కూడా విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది.

ఇక ఆమె కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ ద్వారా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. సినిమాలో కూడా నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అప్పట్లో అయితే ఒక ప్రముఖ హీరో సినిమాలో అవకాశం అన్నట్లు టాక్ వచ్చింది. కానీ మళ్లీ తర్వాత ఏ విధమైన క్లారిటీ అయితే రాలేదు.