Begin typing your search above and press return to search.

తెల్లని చీరలో సురేఖవాని అందాల కవ్వింత

ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు సురేఖ.

By:  Tupaki Desk   |   2 Feb 2024 10:44 AM GMT
తెల్లని చీరలో సురేఖవాని అందాల కవ్వింత
X

సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సురేఖ వాణి ఒకరు. ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. స్టార్ హీరోల చిత్రాల్లో అక్క‌, వ‌దిన పాత్ర‌ల‌్లో కనిపించి ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటారు. ఇటీవల కాలంలో సినిమాలను కాస్త తగ్గించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు సురేఖ.


తన కుమార్తె సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే హంగామా మామూలుగా ఉండదు. పొట్టి పొట్టి దుస్తులను ధరించి తరచూ రీల్స్ చేయడమే కాకుండా వెకేషన్ కు వెళ్తూ వారికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కొన్ని సార్లు తమ పోస్టుల వల్ల సురేఖ, సుప్రీత ట్రోలింగ్ కు గురవుతుంటారు. అయితే మితిమీరిన కామెంట్స్ కు మాత్రం సురేఖ గట్టి కౌంటర్ ఇస్తుంటారు.

తాజాగా సురేఖ వాణి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ శారీ, బ్లాక్ బ్లౌజ్ లో దిగిన కొత్త పిక్ ను షేర్ చేశారు సురేఖ. ఇటీవలే గుండు చేయించుకున్న ఆమె.. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చిన్న స్మైల్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆమె పిక్ పై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఫెంటాస్టిక్, నైస్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవలే సురేఖా వాణి తన కుమార్తెతో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. కాలి న‌డ‌క‌న తిరుమ‌ల చేరుకున్న ఆమె.. వెంక‌న్న‌ను ద‌ర్శించుకుని త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ద‌ర్శ‌నానంత‌రం సురేఖ గుండుతో కనిపించారు. దీంతో ఆమె కొన్ని నెలల వరకు రీల్స్ చేయరని, ఫొటోలు పెట్టరని వార్తలు వచ్చాయి. వాటిని బ్రేక్ చేస్తూ.. సురేఖ ఎప్పటిలానే పిక్స్ షేర్ చేశారు.

ఇక నిన్న తన కుమార్తె సుప్రీత డెబ్యూ మూవీ పూజా కార్యక్రమాల్లో సురేఖ వాణి పాల్గొన్నారు. తన కుమార్తె సినిమా అవకాశాలను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అందరి తల్లులు మాదిరిగా కుమార్తెను ఇండస్ట్రీలోకి పంపించడానికి తాను కూడా కాస్త భయపడినట్లు చెప్పారు. కానీ ఆమెకు చాలా మంచి టీమ్ దొరికిందని, అమర్ నాకు తమ్ముడితో సమానమని అన్నారు.