ఆయన తిరిగొస్తే బాధ పంచుకోవాలని ఉంది..!
ఇక ఇదే ఇంటర్వ్యూలో భర్త సురేష్ తేజను తలచుకుని ఎమోషనల్ అయ్యారు సురేఖా వాణి. తేజ తనకు ఎంతో గౌరవం ఇచ్చే వాడు.
By: Tupaki Desk | 14 March 2024 11:30 PM GMTమొదట సీరియల్స్ లో నటించి ఆ తర్వాత సినిమాల్లో పాపులర్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి అంటే తెలుగు ఆడియన్స్ కు సుపరిచితమే. సీరియల్ డైరెక్టర్ సురేష్ తేజ తో సీరియల్స్ చేస్తున్న టైం లోనే పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల క్రితం సురేష్ తేజ అనారోగ్య కారణాల వల్ల మృతి చెందారు. అప్పటి నుంచి సురేఖా వాణి సినిమాలు తగ్గించారు.
భర్త దూరమైన దగ్గర నుంచి కేవలం సోషల్ మీడియాలోనే తన అప్డేట్స్, ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని అలరిస్తున్నారు సురేఖా వాణి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సోషల్ మీడియా ట్రోల్స్ గురించి స్పందించారు. కామెంట్స్ చూసి మొదట్లో బాధపడ్డా ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడం మంచిదని గుర్తించా.. ఇప్పుడు ఎవరు ఎలా కామెంట్ చేసినా లెక్క చేయనని అన్నారు సురేఖా వాణి. తన కూతురు సుప్రితకు కూడా అదే చెబుతా అంటున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో భర్త సురేష్ తేజను తలచుకుని ఎమోషనల్ అయ్యారు సురేఖా వాణి. తేజ తనకు ఎంతో గౌరవం ఇచ్చే వాడు.. మేమిద్దరం ఒకరిని ఒకరు ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాం. దేవుడు నాకో అవకాశం ఇచ్చి తేజ కనిపిస్తే.. మనసులో బాధ మొత్తం పంచుకోవాలని అనుకుంటున్నా.. ఎన్నో విషయాలు చెప్పాలని ఉంది.. క్షమాపణలు చెప్పాలి.. ఈ బాధ ఎప్పటికీ పోదని ఆయన మాతోనే ఉన్నారని నమ్ముతున్నానని ఎమోషనల్ అయ్యారు సురేఖా వాణి.
సెలబ్రిటీస్ విషయంలో సోషల్ మీడియా ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. వీటిపై ఎవరు ఎంత కంట్రోల్ చేయాలని చూసినా సరే అది జరిగే పని కాదు. సురేఖా వాణి ఆమె కూతురు సుప్రిత గురించి కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే వాటిని పట్టించుకుంటూ బాధపడటం కన్నా వదిలేసి ముందుకెళ్లడం బెటర్ అని సురేఖా వాణి గుర్తించారు. కూతురిని హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్న సురేఖా వాణి మంచి ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే సుప్రీత ఒక ప్రైవేట్ సాంగ్ చేయగా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. మంచి అవకాశం వస్తే తన టాలెంట్ చూపించేందుకు రెడీ గా ఉంది.