Begin typing your search above and press return to search.

ఒర్రీతో సురేఖావాణి..వ్య‌వ‌హారం మూములాగే లేదే!

అందులో సురేఖ‌వాణి భుజాల‌పై చేతుల వేసి ఓ న‌వ్వు న‌వ్వు న‌వ్వుతూ ఫోటోలు దిగాడు. సురేఖ వాణీ కూడా అంతే సంతోషంగా క‌నిపిస్తుంది. ఒర్రీతో ఉన్న ఈఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

By:  Tupaki Desk   |   11 Jun 2024 9:51 AM GMT
ఒర్రీతో సురేఖావాణి..వ్య‌వ‌హారం మూములాగే లేదే!
X

బాలీవుడ్ లో ఓర్రీ అలియాస్ అవత్రమని ఎంత ఫేమ‌స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడు కాక‌పోయినా బాలీవుడ్ సెల‌బ్రిటీలంద‌రితోనూ మంచి ప‌రిచ‌యాలున్నాయి. అందులోనూ యువ హీరోయిన్ల‌లో ఒర్రీ ఫాలోయింగ్ మామూలుగా ఉండ‌దు. ఒర్రీ లేకుండా పార్టీనే సెల‌బ్రేట్ చేసుకోడు. సెల‌బ్రిటీల నైట్ పార్టీల్లో ఒర్రీ ఓ గెస్ట్ లాంటివాడు. అలా వెలుగులోకి వ‌చ్చిన వాడే ఒర్రీ. కుర్ర భామ‌లందిరికీ ఓ బెస్ట్ గా మారిపోయాడు.

ఒర్రీ కింద ఇప్పుడు ఐదారుగురు మేనేజ‌ర్లు కూడా ఉన్నాడు. ఇన్ స్టాతో అంత‌టి పాపులారిటీ ద‌క్కింది. ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. దీంతో ఒర్రీ ఆదాయం కూడా భారీగానే ఉంది. సెల‌బ్రిటీ క్రేజ్ ని తెలివిగా వినియోగించుకుని కెరీర్ లో ముందుకెళ్తున్నాడు. ఈ మ‌ధ్య ఉర్పీ జావేద్ లో చినిగిపోయిన బ‌ట్ట‌లేసుకుని కూడా తిర‌గ‌డం మొద‌లు పెట్టాడు. అదో ర‌క‌మైన ప్ర‌త్యేక‌మైన క్రేజ్ గా మారింది.

ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే తాజాగా టాలీవుడ్ న‌టి సురేఖ‌వాణీతో కూడా ఒర్రీ క‌నిపించాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతోంది. అందులో సురేఖ‌వాణి భుజాల‌పై చేతుల వేసి ఓ న‌వ్వు న‌వ్వు న‌వ్వుతూ ఫోటోలు దిగాడు. సురేఖ వాణీ కూడా అంతే సంతోషంగా క‌నిపిస్తుంది. ఒర్రీతో ఉన్న ఈఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అస‌లు వీళ్లిద్ద‌రు ఎక్క‌డ క‌లిసారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇద్ద‌రు ఓ పార్టీలోనే మీట్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది.

కానీ ఆ పార్టీ ముంబైలో జ‌రిగిందా? హైద‌రాబాద్ లో జరిగిన పార్టీనా? ఈ రెండు గాక విదేశాల్లో చోటు చేసుకుందా? అన్న సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. కార‌ణం ఏదైనా ఒర్రీ ప‌క్క‌న సురేఖ టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పొచ్చు. ఇంత‌వ‌ర‌కూ ఏ తెలుగు న‌టి ఒర్రీతో ఫోటో దిగింది లేదు.