Begin typing your search above and press return to search.

ప్రభాస్ బ్రతికిపోయాడు.. తారక్ దొరికేశాడు..!

అందులోనూ సినిమాలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 8:30 PM GMT
ప్రభాస్ బ్రతికిపోయాడు.. తారక్ దొరికేశాడు..!
X

తొలి సినిమా హిట్ పడగానే ఆ డైరెక్టర్ కి ఒక క్రేజ్ వచ్చేస్తుంది. అందులోనూ సినిమాలో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అలాంటి డైరెక్టర్ గా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే సినిమాతో ఎంట్రీతోనే అదరగొట్టిన సురేందర్ రెడ్డి కొన్ని హిట్లు మరికొన్ని ఫ్లాపులు అంటూ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఐతే ఏజెంట్ సినిమాతో సురేందర్ రెడ్డి అంటేనే బాబోయ్ అనిపించేశాడు.

స్పై థ్రిల్లర్ గా ఆ సినిమా అఖిల్ కెరీర్ లోనే కాదు సురేందర్ రెడ్డి కెరీర్ లో కూడా డిజాస్టర్ కా బాప్ అనిపించుకుంది. ఐతే ఈ డైరెక్టర్ ఆమధ్య ఇంటర్వ్యూలో అతనొక్కడే సినిమా తర్వాత తనకు చాలా ఆఫర్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు. ఐతే తను మాత్రం ప్రభాస్ కోసం ఒక కథ రెడీ చేసుకున్నానని.. అతని ఇమేజ్ కి తగిన కథ అని చెప్పాడు సురేందర్ రెడ్డి. కాకపోతే తన సెకండ్ సినిమా ఎన్ టీ ఆర్ తో అశోక్ చేశానని. అతనొక్కడే తర్వాత ఆ సినిమా చేయాల్సి వచ్చిందని అన్నాడు సురేందర్ రెడ్డి.

ఐతే ప్రభాస్ తో చేద్దామనుకున్న కథతోనే ఎన్టీఆర్ తో చేశాడా అన్న డౌట్ మొదలైంది. సురేందర్ రెడ్డి లేదు కాదు అంటున్నా ఎన్టీఆర్ తో చేసిన అశోక్ కథ ప్రభాస్ కోసం రాసుకున్నదే అని అంటున్నారు. కానీ ప్రభాస్ తో కాకుండా అది తారక్ తో చేశాడు. అశోక్ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నా సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈ న్యూస్ విన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ బ్రతికిపోయాడు తారక్ దొరికేశాడని అనుకుంటున్నారు.

ఏజెంట్ తర్వాత సురేనర్ రెడ్డి సినిమా అంటే చాలు హీరోలెవరు ఆసక్తి చూపించట్లేదు. ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలందరితో చేసిన సురేందర్ రెడ్డి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడని టాక్. మరి ఆ మూవీ ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ తో సురేందర్ రెడ్డి సినిమా అంటే మాత్రం అది కలగానే మిగిలిపోవాల్సిందే అని చెప్పొచ్చు.