Begin typing your search above and press return to search.

నదియా ప్రేమ విషయాన్ని బయటపెట్టిన హీరో..!

అంతేకాదు నదియా బోయ్ ఫ్రెండ్ పేరు కూడా శిరీష్. అతను పేరు శిరీష్.. నా పేరు సురేష్ అలా రెండు పేర్లు దగ్గరగా ఉండటం వల్ల ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో శిరీష్ అని మాట్లాడితే సురేష్ అనుకుని తన గురించి మాట్లాడుకునే వారని అన్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2025 3:06 PM GMT
నదియా ప్రేమ విషయాన్ని బయటపెట్టిన హీరో..!
X

సీనియర్ హీరోల్లో సురేష్ ఎయిటీస్ లో క్రేజీ సినిమాల్లో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో పాటు యూత్ ఫుల్ మూవీస్ లో కూడా నటించి మెప్పించారు సురేష్. ఐతే అప్పట్లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఆయన ఎందుకో మధ్యలో సినిమాలు చేయలేకపోయారు. ఇక ఈమధ్య సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన 80ల హీరోలు రెగ్యులర్ గా టచ్ లో ఉంటామని.. మాకంటూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉందని అన్నారు సురేష్.

ఇక సురేష్ హీరోగా చేస్తున్న టైం లో నదియాతో కలిసి ఎక్కువ సినిమాలు చేశారు. ఆ టైం లో అతనితో నదియాకు లింక్ పెడుతూ వార్తలు రాసుకొచ్చారు. ఐతే నదియాతో తన రిలేషన్ షిప్ గురించి చెప్పారు సురేష్. నదియా తనకు మంచి స్నేహితురాలు ఇంకా చెప్పాలంటే నా సోదరి లాంటిదని అన్నారు. ఎక్కువ సినిమాలు కలిసి చేయడం వల్ల మా ఇద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు వచ్చాయని అన్నారు.

అంతేకాదు నదియా బోయ్ ఫ్రెండ్ పేరు కూడా శిరీష్. అతను పేరు శిరీష్.. నా పేరు సురేష్ అలా రెండు పేర్లు దగ్గరగా ఉండటం వల్ల ఆమె తన బోయ్ ఫ్రెండ్ తో శిరీష్ అని మాట్లాడితే సురేష్ అనుకుని తన గురించి మాట్లాడుకునే వారని అన్నారు. నదియా ఆ తర్వాత శిరీష్ పెళ్లాడింది. ఇప్పటికీ నదియాతో మంచి రిలేషన్ ఉందని క్లారిటీ ఇచ్చారు సురేష్.

సురేష్ కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేశారు. ఒకప్పుడు ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది. కొన్నాళ్లుగా తెర మీద కనిపించడం మానేసిన సురేష్ తిరిగి సినిమాల్లో నటించాలని ఉందని చెప్పారు. కెరీర్ లో 270 కి పైగా సినిమాల్లో నటించిన సురేష్ తెలుగుతో పాటు తమిళ్ సినిమాలు కూడా చేశారు. 80ల కాలం నాటి హీరోల్లో సురేష్ కూడా అప్పటి ప్రేక్షకులను ఒక రేంజ్ లో అలరించారు. సురేష్ మళ్లీ నటించేందుకు సిద్ధం అంటున్నారు కాబట్టి తప్పకుండా ఆయనకు మంచి పాత్రలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీనియర్ హీరో ఎక్స్ పీరియన్స్ కూడా సినిమాకు ప్లస్ అవుతాయని చెప్పొచ్చు.