హేమ కమిటీ నివేదిక గురించి కేంద్రమంత్రి ఏమన్నారంటే?
జస్టిస్ హేమ కమిటీ నివేదికతో మాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 27 Aug 2024 9:18 AM GMTజస్టిస్ హేమ కమిటీ నివేదికతో మాలీవుడ్ ఒక్కసారిగా షేక్ అయిన సంగతి తెలిసిందే. లైంగిక వేధింపులు మాకు ఎదరయ్యాయి? అంటూ ఇప్పటికే చాలా మంది నటీమణులు మీడియా ముందుకొచ్చి ఆరోపించారు. దీంతో దేశ వ్యాప్తంగా కన్నడ ఇండస్ట్రీ పేరు మారు మ్రోగిపోతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక కావడంతో ఎవరూ ఈ ఆరోపణలని కొట్టి పారేయలేని పరిస్థితి.
ఇప్పటికే ఇండస్ట్రీకి కాస్త మద్దతుగా నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ వ్యాఖ్యానించారు. అలాగని హేమ కమిటీ నివేదికని తప్పు పట్టలేదు. వాస్తవాలు తేలాల్సి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపీ స్పందించారు. ఈ అంశంపై మీడియా చేస్తోన్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేసారు. చిత్ర పరిశ్రమపై ప్రజల అభిప్రాయాల్ని తప్పుబట్టేలా మీడియా వ్యహరిస్తుందన్నారు.
`ఈ ఆరోపణలే మీడియాకి ఆహారం పెడుతున్నాయి. మీరంతా డబ్బు సంపాదించుకోవడానికి ఇలాంటి వాటిని వాడుకుంటున్నారని అర్దమైంది. అయితే వాస్తవాలు ఏంటో తెలియకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సరికాదు. మీ స్వలాభాల కోసం అలజడి సృష్టించడమే కాకుండా వారి అభిప్రాయాల్ని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు న్యాయస్థానం కంటే గొప్ప కాదు. ఈ సమస్య కోర్టు ఫరిదిలో ఉంది.
నిజానిజాలు తేల్చాల్సింది కోర్టు. అంత వరకూ వెయిట్ చేయండి. అసత్యాలు ప్రచారం చేయకండి. న్యాయస్థానాన్ని ఓ నిర్ణయం తీసుకోనివ్వండి` అని అన్నారు. అయితే ఈ నివేదికపై సీనియర్ హీరోలెవరూ ఇంకా స్పందించలేదు. మోహన లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.