Begin typing your search above and press return to search.

సమంత పరిస్థితి అర్డం చేసుకొని.. డబ్బు సాయం చేసిన నిర్మాత

ఇక అల్లుడు శీను సినిమా సమయంలో సమంత చర్మానికి సంబంధించి ఒక సమస్య ఎదుర్కొందని తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   6 Dec 2024 8:00 AM GMT
సమంత పరిస్థితి అర్డం చేసుకొని.. డబ్బు సాయం చేసిన నిర్మాత
X

సమంత ఆ మధ్య తన ఆరోగ్య విషయంపై క్లారిటీ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందమైన బుట్టబొమ్మ తరహాలో ఉండే సమంత ఇంత కష్టపడిందా అంటూ ఎమోషనల్ అయ్యారు. తన కెరీర్ ప్రారంభంలోనే అమ్మడు అనారోగ్య సమస్యలతో పోరాడినట్లు తెలుస్తోంది. ఇక వాటిని పెద్దగా పట్టించుకోకుండా అమ్మడు నేడు ఒక సక్సెస్‌ఫుల్ స్టార్‌గా నిలిచింది. ఇక అల్లుడు శీను సినిమా సమయంలో సమంత చర్మానికి సంబంధించి ఒక సమస్య ఎదుర్కొందని తాజాగా నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.

25 ఏళ్ల సినిమా ప్రయాణం సందర్భంగా బెల్లంకొండ చెప్పిన ఈ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో సినిమా షూటింగ్‌లకు పెద్ద సవాలుగా మారిన ఆరోగ్య సమస్యను సమంత ధైర్యంగా ఎదుర్కొంది. అయితే, ఆ సమయంలో కొందరు నిర్మాతలు వెనకడుగు వేసినా, బెల్లంకొండ సురేష్ మాత్రం ముందుకు వచ్చి సాయం చేశారట. సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకొని సపోర్ట్ గా నిలిచారు.

వెంటనే చికిత్స కోసం 25 లక్షలు ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్లో పార్క్ హయత్ హోటల్‌లో సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి ఆమెకు అవసరమైన వసతులను అందించినట్లు చెప్పారు. ఇది సమంతకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఆ ఆప్యాయతను ఆమె జీవితంలో మరచిపోలేదట. ఈ కారణంగా సమంత ఇప్పటికీ బెల్లంకొండ సురేష్ కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగిస్తుంది.

భారీ బడ్జెట్ సినిమాలు చేసే సమయంలో ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్ని అధిగమించడం ఈజీ కాదు. కానీ సమంత తన కఠినసమయంలోనూ నటనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగింది. అయితే, ఈ రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మయోసైటిస్ వ్యాధి ఆమెకు మరింత కఠినమైన పరీక్షను నిలిపింది. అయినప్పటికీ ఆమె బలంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

తాజాగా సమంత సిటాడెల్ హనీ బన్నీ ప్రాజెక్ట్‌లో భాగమై స్టంట్స్ ఫైట్లు చేయడానికి నెలల తరబడి శిక్షణ తీసుకుంది. ఈ ప్రయత్నం ఆమె కష్టపడి చేసింది. కానీ, ఈ సిరీస్ ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అభిమానులు ఈ సిరీస్‌పై ఉన్న హైప్‌ను దృష్టిలో పెట్టుకుని, మరింత ప్రభావవంతమైన ప్రదర్శన ఆశించారు. ప్రస్తుతం ఆమె రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.

సమంత తన అనారోగ్య సమస్యలను అధిగమించి కెరీర్‌లో ముందుకు సాగుతున్న తీరుకు పలువురు ప్రేరణ పొందుతున్నారు. నేడు ఆమె స్వంత బ్యానర్ మీద ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ, క్రియేటివ్ వర్క్‌పై మరింత దృష్టి పెడుతోంది. 'మా ఇంటి బంగారం' పేరుతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ, ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. సమంత ఇప్పుడు తన ఆరోగ్యం కోసం మరింత శ్రద్ధ వహిస్తూనే నటనలో కొత్త తరహా అడుగులు వేస్తోంది. తన కెరీర్ ప్రారంభంలోనే పలు ఇబ్బందులను ఎదుర్కొని, దానిని అధిగమించి టాప్ హీరోయిన్‌గా ఎదగడం సమంత ధైర్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు.