స్టార్ హీరో పెంపకాన్ని పొగిడేసిన సీనియర్ నటుడు!
రణబీర్ కపూర్ లాంటి చాక్లెట్ బోయ్ ని డాన్ గా రస్టిక్ పాత్రలో అద్భుతంగా చూపించాడని ప్రశంసలు కురిసాయి.
By: Tupaki Desk | 7 Jun 2024 4:42 PM GMTసందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన `యానిమల్` చాలా కోణాల్లో ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ విజయాన్ని మించి ఈ సినిమా ప్రముఖుల డిబేట్లలో ముఖ్యాంశంగా మారింది. ఈ సినిమాలో మరోసారి హీరోయిజాన్ని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సందీప్ వంగాపై ప్రశంసలు కురిసాయి. రణబీర్ కపూర్ లాంటి చాక్లెట్ బోయ్ ని డాన్ గా రస్టిక్ పాత్రలో అద్భుతంగా చూపించాడని ప్రశంసలు కురిసాయి.
ఇప్పుడు ఈ చిత్రంలో రణబీర్ సహనటుడు సురేష్ ఒబెరాయ్ ప్రశంసలు కురిపించాడు. యానిమల్ చిత్రంలో తన పాత్ర చనిపోయే సీన్ ఉంటుందని, కానీ దర్శకుడు సందీప్ వంగా చివరకు దానిని మార్చాడని కూడా తెలిపాడు. అనుభవజ్ఞుడైన సీనియర్ నటుడు సురేష్ ఒబెరాయ్ యానిమల్‌లో రణబీర్ కపూర్ తాతగా నటించారు. సీక్వెల్ యానిమల్ పార్క్‌లో కూడా తన పాత్ర కొనసాగుతుందని వెల్లడించాడు.
సురేష్ ఒబెరాయ్ దర్శకుడు సందీప్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. కబీర్ సింగ్ చిత్రీకరణ సమయంలో నాతో కలిసి పని చేయడాన్ని ఇష్టపడతానని వంగా నాకు చెప్పేవాడు. మేం చెప్పేది ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి చూపిస్తారు.. ఇబ్బంది పెట్టరు! అని అని తనతో అన్నట్టు వెల్లడించారు. ఆ తర్వాత యానిమల్ లోను అవకాశం కల్పించాడు. ఇందులో నా పాత్ర చనిపోవలసి ఉంది. కాని ఆ భాగాన్ని తీసివేసి, నేను కూడా యానిమల్ పార్కులో ఉండాలని అతడు కోరుకున్నాడు. నేను మరణ దృశ్యం గురించి ఆరా తీసినప్పుడు దానిని ఎడిటింగ్ లో కత్తిరించినట్లు చెప్పాడు. ఎందుకంటే నేను రెండవ భాగంలో కూడా కనిపించాలని కోరుకున్నాడని ఒబెరాయ్ తెలిపారు.
అలాగే రణబీర్ కపూర్ పైనా ఒబెరాయ్ ప్రశంసలు కురిపించారు. యువహీరో ప్రవర్తన చాలా అద్భుతంగా ఉందని, నీతూజీ పెంపకాన్ని కూడా పొగిడేశారు. రణబీర్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతడు స్వీట్ పర్సనాలిటీ. తన మర్యాద పూర్వక ప్రవర్తన గురించి నీతూ కపూర్‌కు టెక్స్ట్ మెసేజ్ పంపాను.. అతడి క్రమశిక్షణ, పెద్దలతో మాట్లాడే విధానం నన్ను చాలా ఆకట్టుకున్నాయి. నీతూజీ ధన్యవాదాలు. అతడు తన తండ్రిలాగే అద్భుతమైన నటుడు. అతడు ఏ ఒక్క అంశంలో కూడా విఫలం కాడు`` అని సంక్షిప్త సందేశం ఇచ్చినట్టు వెల్లడించాడు.
యానిమల్ చిత్రంలో రష్మిక మందన్న, అనిల్ కపూర్, ట్రిప్టి డిమ్రీ ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా బ్లాక్ బస్టర్ అయింది. పలువురు సినీ ప్రముఖులు, సమీక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు అందుకుంది. కానీ బాక్సాఫీస్ విజయాన్ని ఇవేవీ ఆపలేకపోయాయి.