సూర్యతో మొండేటి 300 ఏళ్ల క్రితం నాటి కథతో!
సూర్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రానికి కొన్నాళ్ల క్రితం బీజం పడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Feb 2025 8:03 AM GMTసూర్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రానికి కొన్నాళ్ల క్రితం బీజం పడిన సంగతి తెలిసిందే. సూర్యకి చందు అదిరిపోయే హిస్టారికల్ సబ్జెక్ట్ చెప్పినట్లు..ఆయన అంగీకరించి నట్లు కొన్ని 'కంగువా' సమయంలో మీడియాలో కథనాలు వెడెక్కించాయి. 'కార్తికేయ -2' తర్వాత చందు చేయబోయేది ఇదే సినిమా అవుతుందని కూడా అప్పట్లో గట్టి ప్రచారం జరిగింది.
కానీ ఆ తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అప్ డేట్ రాలేదు. సూర్య వేర్వేరు సినిమాలో బిజీగా ఉండటం.. చందు కూడా 'తండేల్' సినిమాతో బిజీ అవ్వడంతో? సూర్య-చందు ప్రాజెక్ట్ పై మళ్లీ ఎలాంటి ప్రచారం తెరపైకి రాలేదు. ఈనేపథ్యంలో తాజాగా ఈ ప్రచారమంతా నిజమేనని...ఇద్దరు కలిసి భారీ పాన్ ఇండియా సినిమా తీయబోతున్నట్లు చందు మొండేటి ప్రకటించాడు. అలాగే సినిమా స్టోరీ లైన్ కూడా లీక్ చేసారు.
ఇదో పిరియాడిక్ సబ్జెక్ట్ అని, 300 ఏళ్ల క్రితం నాటి చరిత్రను ఆధారంగా చేసుకుని రాసిన సబ్జెక్ట్ గా తెలిపారు. ఇప్పటికే సూర్యకి స్టోరీ వినిపించినట్లు...ఆయన కూడా ఒకే చేసినట్లు పేర్కొన్నారు. 'కార్తికేయ 3' సినిమా కంటే ముందే సూర్యతో ఈ సినిమా చేయాలని ఉందని వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయం లో చందు మొండేటి ఎంత సీరియస్ గా ఉన్నారు? అన్నది అద్దం పడుతుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ ముందుకు కదలాలంటే? సూర్య ముందుకు రావాలి. కంగువ సూర్య తొలి పాన్ ఇండియా చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో ఆయన కొన్నాళ్ల పాటు ప్రయోగాలకు దూరంగా ఉంటానని అన్నారు . ఈ నేపథ్యంలో చందు మొండేటి స్టోరీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది చూడాలి.