Begin typing your search above and press return to search.

'300' లాంటి సినిమాల‌కు గేట్లు ఓపెన్ చేసింది రాజ‌మౌళినే!

కానీ వాళ్లెవ్వ‌రూ రాజ‌మౌళిలా క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో స‌క్సెస్ కాలేక‌పోయారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 1:30 PM GMT
300 లాంటి సినిమాల‌కు గేట్లు ఓపెన్ చేసింది రాజ‌మౌళినే!
X

రాజ‌మౌళి కంటే ముందే వార్ బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ ద‌ర్శ‌కులు చాలా సినిమాలు చేసారు? కానీ వాళ్లెవ్వ‌రూ రాజ‌మౌళిలా క‌మ‌ర్శియ‌ల్ యాస్పెక్ట్ లో స‌క్సెస్ కాలేక‌పోయారు. రాజ‌మౌళికి బాలీవుడ్ దర్శ‌కుల‌కు ఉన్న తేడా అదే? ఎమోష‌న్ ని ప‌ర్పెక్ట్ గా క్యారీ చేయ‌డంలో రాజ‌మౌళి దిట్ట అని `బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి సినిమాల‌తో రుజువు చేసారు. టెక్నిక‌ల్ గానూ సినిమాను హైస్టాండ‌ర్స్డ్ లో తీయ‌డం జ‌క్క‌న్న‌కు తెలిసిన‌ట్లు గా బాలీవుడ్ టెక్నిషియ‌న్ల‌కు తెలియ‌లేదు.

అందుకే బాహుబ‌లి లో వార్ స‌న్నివేశాలు అంత గొప్ప‌గా పండాయి. అందులో చాలా స‌న్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుంచి స్పూర్తిగా తీసుకున్నా? కాపీ కొట్టినా? రాజ‌మౌళి వ‌ర‌ల్డ్ వైడ్ ఓ బ్రాండ్ గా ముద్ర వేసుకున్నారు. అదే బ్రాండ్ తో ఆస్కార్ సైతం తేగ‌లిగారు. మొత్తంగా రాజ‌మౌళి కార‌ణంగా ఇండియ‌న్ సినిమా రూపు రేఖ‌లు మారాయి? అన్న‌ది కాద‌న‌లేని నిజం. బాహుబ‌లి త‌ర్వాత చాలా మంది ద‌ర్శ‌కుల ఆలోచ‌నా విధానంలో మార్పులొచ్చాయి.

కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ రాజ‌మౌళిలా సినిమాలు తీయాల‌నే ఆలోచ‌న మొద‌లైంది. సినిమా బ‌డ్జెట్ లు పెరిగాయి. నిర్మాత డేరింగ్ గా కోట్ల రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్ట‌డానికి ముందు కొస్తున్నారు. ఇలా ఇన్ని రకాలుగా భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మార్పులు తీసుకొచ్చినా? రాజ‌మౌళికి అందుకే స‌లాం చేస్తున్నారంతా. తాజాగా `కంగువ` రిలీజ్ నేప‌థ్యంలో హీరో సూర్య జ‌క్క‌న్న‌ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`బాహుబ‌లి`, `ఆర్ ఆర్ ఆర్`, `కాంతార` లాంటి సినిమాలు ఇలా ఆలోచించి అడుగు వేసిన‌ప్పుడే సాద్య‌మ‌వుతాయి. హాలీవుడ్ నుంచి `బ్రేవ్ హార్ట్`, `300` లాంటి సినిమాలు చూసిన‌ప్పుడు ఇలాంటి సినిమాలు మ‌నం ఎప్పుడు చేస్తామో అనుకునేవాడిని. అలాటి సినిమాల‌కు గేట్లు ఓపెన్ చేసింది రాజ‌మౌళి గారు. ప్రాంతీయ సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చ‌ని ఆయ‌న దారి చూపించారు. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.