Begin typing your search above and press return to search.

20 ఏళ్ల తర్వాత సిగరెట్ వెలిగిన స్టార్ హీరో..!

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్ర గురించి ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   30 Oct 2024 3:00 AM GMT
20 ఏళ్ల తర్వాత సిగరెట్ వెలిగిన స్టార్ హీరో..!
X

కోలీవుడ్ విలక్షణ కథానాయికల్లో సూర్య ఒకరు. తన సినిమాలతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాదు సౌత్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తూ వస్తున్నారు సూర్య. కేవలం తమిళ్ లోనే కాదు సూర్య సినిమాలకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన గజిని సినిమా నుంచి సూర్యకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే సూర్య సినిమా రిలీజ్ అంటే చాలు తెలుగు ఆడియన్స్ కూడా అలర్ట్ గా ఉంటారు. సూర్య లేటెస్ట్ మూవీ కంగువ నవంబర్ రెండో వారం రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సూర్య విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్ర గురించి ప్రస్తావించారు.

లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రం సినిమాలో సూర్య నటించిన రోలెక్స్ పాత్రకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాఫియా డాన్ గా రోలెక్స్ లుక్ లో సూర్య అదరగొట్టాడు. ఐతే ఈ రోల్ గురించి లోకేష్ చెప్పగానే హాఫ్ డే లోనే షూట్ కంప్లీట్ చేయమని అన్నారట. కమల్ సెట్స్ కి రాకముందే షూట్ పూర్తి చేయాలని లోకేష్ కి చెప్పాడట సూర్య. అంతేకాదు ముందే డైలాగ్ పంపించడంతో ఇలా వెళ్లి అలా షూట్ పూర్తి చేశారట. ఐతే ఆ పాత్ర ఆడియన్స్ లో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఊహించలేదని అన్నారు సూర్య.

రోలెక్స్ పాత్రకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఐతే ఆ పాత్ర కోసం తాను పెద్దగా కష్టపడింది లేదని చెప్పారు సూర్య. ఐతే ఆ పాత్ర కోసం తాను 20 ఏళ్ల క్రితం మానేసిన సిగరెట్ ని మళ్లీ వెలిగించానని అన్నారు సూర్య. ముందు సిగరెట్ లేకుండా సీన్ కానిచ్చేద్దామని అనుకున్నారట కానీ క్యారెక్టర్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే ఉండాల్సిందే అని అనుకున్నారట. అందుకే సిగరెట్ వెలిగించక తప్పలేదని అంటున్నారు సూర్య.

కంగువ సినిమా విషయానికి వస్తే దాదాపు వందల సంవత్సరాల క్రితం మనుషుల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కింది. శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా స్పెషల్ హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది. సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ నటించాడు.

కంగువ మీద సూర్య అండ్ టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన ప్రచార చిత్రాలు కూడా కంగువ మీద ఆసక్తి కలిగేలా చేశాయి. మరి సినిమా బాక్సాఫీస్ పై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.