Begin typing your search above and press return to search.

బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరో డ‌బుల్ గేమ్!

రెండు గొప్ప చిత్రాలే అయినా? కరోనా వైర‌స్ లాంటివి ఆ రెండిపై ప్ర‌భావాన్ని చూపించాయి.

By:  Tupaki Desk   |   10 March 2025 2:00 PM IST
బ్యాక్ టూ బ్యాక్ స్టార్ హీరో డ‌బుల్ గేమ్!
X

కోలీవుడ్ స్టార్ సూర్యకి స‌రైన మాస్ థియేట్రిక‌ల్ హిట్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. 'సింగం 3' తర్వాత అ రేంజ్ హిట్ మ‌రోటి ప‌డ‌లేదు. మ‌ధ్య‌లో 'ఆకాశం నీహ‌ద్దురా', 'జైభీమ్' లాంటి సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. కానీ అవి ఓటీటీ రిలీజ్ లు కావ‌డంతో? అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఆ సినిమాలు చేర‌లేదు. రెండు గొప్ప చిత్రాలే అయినా? కరోనా వైర‌స్ లాంటివి ఆ రెండిపై ప్ర‌భావాన్ని చూపించాయి.

'కంగువ‌'తో పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌ మ‌వ్వాల‌ని చూసాడు గానీ ఆ ప్ర‌య‌త్నం దారుణంగా బెడిసి కొట్టింది. దెబ్బ‌కు మ‌ళ్లీ అలాంటి సినిమాలు చేయాలంటేనే సూర్య‌ని ఆలోచ‌న‌లో ప‌డేస్తున్నాయి. అందుకే కొన్నాళ్ల పాటు మాస్ కంటెంట్ ఉన్న చిత్రాలు త‌ప్ప ప్రయోగాల జోలికి వెళ్ల‌న‌ని సూర్య డిసైడ్ అయిపోయాడు. ప్ర‌స్తుతం మాస్ అప్పిరియ‌న్స్ ఉన్న క‌థ‌ల‌కే ఆస‌క్తి చూపిస్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కార్తీక్ సుబ్బ‌రాజ్ తో `రెట్రో` షూటింగ్ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇదీ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్. అందులోనే బ‌ల‌మైన ప్రేమ క‌థ‌ను కూడా చెబుతున్నాడు సుబ్బ‌రాజ్. ఈ సినిమా లో సూర్య ద్విపాత్రాభిన‌యం చేస్తున్న‌ట్లు లీకైంది. ఇంత వ‌ర‌కూ ఇందులో సూర్య సింగిల్ రోల్ అనుకున్నారు. కానీ రెండు పాత్ర‌ల్లో పాత్ర డిఫ‌రెంట్ గా ఉంటుందంటున్నారు.

ఆ రోల్ చాలా ట్రిక్కీగానూ ఉంటుందిట‌. అలాగే సూర్య ప‌ట్టాలెక్కించిన 45 చిత్రం ఆర్జే బాలాజీ సినిమాలోనూ సింగం డ్యూయెల్ రోల్ నే క‌నిపించ‌నున్నాడుట‌. ఇది భారీ యాక్ష‌న్ చిత్ర‌మే. అందులో ఓ పాత్ర ప్ర‌తినాయ‌కుడి రోల్ అని కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెతో తెలియాలి. గ‌తంలో 'బ్ర‌ద‌ర్స్', '24' లాంటి చిత్రాల్లో సూర్య డ్యూయోల్ రోల్ పోషించిన సంగ‌తి తెలిసిందే.