ఆ విషయంలో సూర్య డెసిషన్ కరెక్ట్ గా లేదా?
గత కొన్ని సినిమాలుగా సూర్య తీసుకుంటున్న నిర్ణయాలు, ఎంపిక చేసుకుంటున్న సినిమాలు ఆయన ఫ్యాన్స్ కు సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి.
By: Tupaki Desk | 30 Jan 2025 7:30 AM GMTనటీనటులెవరైనా సినిమాల ఎంపిక విషయంలో సరైన డెసిషన్ తీసుకోకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. దీనికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యనే బెస్ట్ ఎగ్జాంపుల్. గత కొన్ని సినిమాలుగా సూర్య తీసుకుంటున్న నిర్ణయాలు, ఎంపిక చేసుకుంటున్న సినిమాలు ఆయన ఫ్యాన్స్ కు సంతృప్తిని ఇవ్వలేకపోతున్నాయి.
రీసెంట్ గా రిలీజైన పరాశక్తి టీజర్ ను చూసి సూర్య ఫ్యాన్స్ తెగ వర్రీ అవుతున్నారు. దానికి కారణం ఈ సినిమాకు ముందు అనుకున్నది సూర్యనే. ఆకాశం నీ హద్దురా సినిమా తర్వాత మరోసారి సుధా కొంగరతో సినిమా చేయాలనుకున్న సూర్య ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశాడు. కానీ కంటెంట్ సున్నితంగా ఉందని, ఒకవేళ తాను ఈ సినిమా చేస్తే కాంట్రవర్సీ అవుతుందేమోననుకుని సూర్య ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు.
దీంతో ఆ ప్రాజెక్ట్ శివ కార్తికేయన్ దగ్గరకు వెళ్లింది. దశాబ్దాల కిందట జరిగిన కొన్ని సెన్సేషనల్ సంఘటనలను తీసుకుని సుధా కొంగర ఈ టీజర్ ను చాలా బాగా తెరకెక్కించింది. టీజర్ చూసిన తర్వాత అందరూ అదిరిపోయిందంటున్నారు. శివ కార్తికేయన్ ప్లేస్ లో సూర్య ఉంటే ఆ టీజర్ కు ఇంకా భారీ రెస్పాన్స్ వచ్చుండేది.
పోనీ ఈ సినిమాను వద్దనుకుని ఏదైనా గొప్ప సినిమా చేస్తున్నాడా అంటే ఇంకా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోని ఆర్జె బాలాజీతో సినిమా చేస్తున్నాడు. ఇదొక్కటే కాదు కంగువ సినిమా విషయంలో కూడా సూర్య తీసుకున్న నిర్ణయం కరెక్ట్ గా లేదు. శిరుత్తై శివని నమ్మి దాని కోసం అంత ఎక్కువ టైమ్ కేటాయించడం పట్ల కూడా ఫ్యాన్స్ అసంతృప్తిగానే ఉన్నారు. తీరా చూస్తే కంగువ సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది.
వీటితో పాటూ వెంకీ అట్లూరితో అనుకున్న ప్రాజెక్టును కూడా సూర్య వద్దనుకున్నాడని, అందుకే ధనుష్ తో ఆ సినిమాను ఓకే చేయించుకున్న వెంకీ త్వరలోనే దాన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. కంగువ డిజాస్టర్ తర్వాత సూర్య తన ఆశలన్నింటినీ తను ప్రస్తుతం చేస్తున్న రెట్రో పైనే పెట్టుకున్నాడు. మరి రెట్రో అయినా సూర్య నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.