సూర్య.. ఈసారి మిస్సవ్వకుండా..
ఓవరాల్ గ్లింప్స్ మాత్రం బాగుందనే చెప్పాలి. ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
By: Tupaki Desk | 6 Feb 2025 6:44 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యాక్షన్, ప్రేమ, గాఢమైన భావోద్వేగాలతో గ్రాండ్ గా రెట్రో మూవీ రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే సినిమాను 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన భార్య జ్యోతికతో కలిసి సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంది. పూజ లుక్స్ పై కాస్త విమర్శలు వచ్చినా.. ఓవరాల్ గ్లింప్స్ మాత్రం బాగుందనే చెప్పాలి. ఆడియన్స్ లో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
గ్యాంగ్ స్టర్ అయిన హీరో.. తాను ప్రయాణం చేస్తున్న హింస మార్గం నుంచి బయటకొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని తన ప్రేయసికి చెప్పే సీన్లు టీజర్ లో కనిపించాయి. అది జరిగిందో లేదో తెలియాలంటే సినిమా వరకు ఆగాల్సిందేనని అంటున్నారు మేకర్స్. మే1న సమ్మర్ కానుకగా మూవీ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు.
అయితే మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అవ్వగా.. రీసెంట్ గా ఫైనల్ కట్ ను సూర్య చూసినట్లు తెలుస్తోంది. అవుట్ పుట్ తో చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం. మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి.
రీసెంట్ గా సూర్య.. కంగువా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీ బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. భారీ డిజాస్టర్ గా మారింది. అయితే ఆ సినిమా ఫైనల్ కట్ ను సూర్య చూడలేదని... రిలీజ్ అయ్యాక చూశారని వినికిడి. ఇప్పుడు రెట్రోతో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు చూస్తున్నారట. కంగువా సినిమాలో లో జరిగిన పొరపాటు ఇక్కడ జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో సూర్య కొంతకాలంగా థియేట్రికల్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కంగువా కన్నా ముందు చిత్రాలు సూరరై పోట్రు, జై భీమ్.. ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కంగువా రిజల్ట్ ఏమైందో తెలిసిందే. దీంతో ఇప్పుడు రెట్రోతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని ధీమాతో ఉన్నారు. మరి రెట్రో మూవీ ఎలా ఉంటుందో.. సూర్య ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.