స్టార్ హీరోకి జైలు రుచి చూపించిన డైరెక్టర్!
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా `రెట్రో` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 March 2025 11:00 PM ISTకోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా `రెట్రో` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సూర్య ఫస్ట్ లుక్ సహా మరికొన్ని ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. సుబ్బరాజ్ మ్యాజిక్ ఈ సినిమాలోనూ కనిపిస్తుందని అభిమాను లంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. అందుకు తగ్గట్టే మేకర్స్ సినిమాపై బజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తాజాగా ఈ సినిమా ఆన్ సెట్స్ అనుభవాల గురించి సూర్య రివీల్ చేసారు.` చెన్నైలో బీఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ పరిసరాల్లో రెట్రో కోసం ఓ భారీ జైలు సెట్ వేసారు. లైబ్రరీ, వంటగది అన్నింటిని ఆర్ట్ డిపార్ట్ మెంట్ వాళ్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. అందులో ఐదు రోజుల పాటు షూటింగ్ చేసాం. ఆ ఐదు రోజులు నిజంగా జైల్లో ఉన్నట్లే అనిపించింది.
అంత వాస్తవ అనుభవాన్ని జైలు సెట్లో చూసాను. ఆ పాటలో డాన్స్ మూవ్ మెంట్స్ కూడా బాగుంటాయి. అన్నిరకాల ఎమోషన్ రెట్రో కథలో ఉంది. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది` అని అన్నారు. ఈ సినిమా సక్సస్ సూర్యకి కీలకం. గత సినిమా కంగువ పాన్ ఇండియాలో రిలీజ్ అయి డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. సూర్య నుంచి మరో ప్రయోగాత్మక చిత్రమైనా ప్రేక్షకుల్ని మెప్పించలేక పోయింది.
ఈ నేపథ్యంలో సూర్య కూడా కొన్నాళ్ల పాటు ప్రయోగాలు చేయనని ప్రకటించిన సంగతి తెలిసిందే. కమర్శియల్ సినిమాలకే మొదటి ప్రాధ్యనత ఇస్తానని..అలాంటి కథలే కొన్నాళ్ల పాటు చేస్తానని అన్నారు. సూర్య తదుపరి చిత్రం ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా ఆన్ సెట్స్ లో ఉంది. ఇది భారీ మాస్ ఎంటర్ టైనర్. బాలాజీకి దర్శకుడిగా ఇదే తొలి సినిమా అయినా అతడిపై నమ్మకంతో సూర్య ఛాన్స్ ఇచ్చాడు.