ఇంటి బయటే స్టార్ డమ్ వదిలేసి ఇంట్లోకి!
కానీ ఇద్దరు నటనారంగంలో ఉంటే మాత్రం ఇంట్లో కూడా సినిమా డిస్కషన్స్ అనేవి సహజంగా జరుగుతుంటాయని అంతా అంటుంటారు.
By: Tupaki Desk | 28 Feb 2025 11:56 AM ISTసెలబ్రిటీలు భార్యా భర్తలైతే ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో గెస్ చేయాల్సినపనిలేదు. హీరో-హీరోయిన్లు ఇద్దరు రియల్ లైప్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్నికంటే? ఇంట్లో చిన్ననాటి నుంచి పిల్లలకు సినిమా వాతావరణం అలవాటుగా మారుతంది. ఎవరో ఒకరు నటి అయితే? ఆ వాతావరణం దూరమవ్వడానికి కొంచమైనా ఛాన్స్ ఉంటుంది. కానీ ఇద్దరు నటనారంగంలో ఉంటే మాత్రం ఇంట్లో కూడా సినిమా డిస్కషన్స్ అనేవి సహజంగా జరుగుతుంటాయని అంతా అంటుంటారు.
అయితే సూర్య-జ్యోతిక దంపతులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నామంటున్నారు. షూట్ నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తమ స్టార్ డమ్ గుమ్మం బయటే వదిలేసారి సాధారణ భార్య భర్తల్లా ఇంట్లో గడుపుతారుట. ఇంట్లో సినిమా అనే టాపిక్ రాకుండా చూసుకుంటారుట. సాధారణ గృహిణి జీవితాన్నే జ్యోతిక ఆస్వాదిస్తుందని తెలిపారు. పిల్లల పనులు తానే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారుట.
ఉదయం టిఫిన్ బాక్స్ నుంచి లంచ్ బాక్స్ వరకూ పిల్లలకు కావాల్సిన వన్నీ తానే స్వయంగా రెడీ చేస్తారుట. సూర్య కూడా పిల్లల పట్ల అంతే బాధ్యతగా వ్యవహరిస్తారని తెలిపారు. పిల్లల ముందు సినిమాల గురించి టాపిక్ చాలా తక్కువగా వస్తుందని...ప్రస్తుతానికి పిల్లలిద్దర్నీ చదువుపైనే దృష్టిపెట్టమని నిరంతరం చెబుతారుట. పిల్లలు సినిమాల వైపు ఆకర్షితులవ్వడం సహజంగా జరిగుతుందని..కానీ అందుకు దూరంగా పిల్లల్ని పెంచుతున్నామని తెలిపారు.
ప్రత్యేకంగా చెన్నై నుంచి ముంబైకి మారడానికి కారణంగా వారి చదువులను దృష్టిలో పెట్టుకునే ఓ ప్లానింగ్ ప్రకారం వెళ్తున్నట్లుచెప్పారు. ప్రస్తుతం జ్యోతిక ఎక్కువగా హిందీ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. చెన్నైలో ఉన్నంత కాలం కోలీవుడ్ సినిమాలు చేసారు. అక్కడ నుంచి ముంబైకి వెళ్లిన తర్వాత బాలీవుడ్ సినిమాలపైనే దృష్టి పెట్టారు.