Begin typing your search above and press return to search.

కంగువ సెన్సార్ రిపోర్ట్.. ఇది అసలు ఊహించలేదే..

అయితే సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. సినిమాలో ఊచకోత అనేలా బోల్డ్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   8 Nov 2024 4:48 PM GMT
కంగువ సెన్సార్ రిపోర్ట్.. ఇది అసలు ఊహించలేదే..
X

సూర్య నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'కంగువ' మూవీ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ బాహుబలిగా బిగ్గెస్ట్ రికార్డులను బ్రేక్ చేయడం గ్యారెంటీ అని మేకర్స్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహించడం విశేషం. సినిమా కంటెంట్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను నచ్చుతుందని నిర్మాత కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక ఫైనల్ గా సెన్సార్ వర్క్ ను ఫినిష్ చేసుకున్న ఈ సినిమా కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 350 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించబడింది. తమిళ నేటివిటీ నేపథ్యంలో ఉన్నప్పటికీ పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. అడ్వెంచరస్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మోషన్ పోస్టర్స్, టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ రావడంతో అందరూ షాక్ అవుతున్నారు. సినిమాలో ఊచకోత అనేలా బోల్డ్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చారు. రక్తపాతం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే U/A సరైఫికెట్ రావడంతో సినిమాలో అలాంటి సీన్స్ లేవేమో అనేలా కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్‌కి రప్పించేందుకు ఇది కీలకంగా మారింది.

మరింత ఆకర్షణీయంగా అనిపించే ఈ సినిమా, ప్రేక్షకులకు 3డీ అనుభవాన్ని అందించనుంది. 3డీ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటాయని యూనిట్ పేర్కొంటోంది. ఏదేమైనా ఇంత వైల్డ్ సినిమాకు సెన్సార్ రిపోర్ట్ వచ్చిన విధానం హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమాలో కంటెంట్ ఏ విధంగా ఉందొ చూడాలి అనే ఆసక్తి కలుగుతోంది.

'కంగువ' కోసం సూర్య చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పవచ్చు. పాత్రలో అంతర్లీనమైన భిన్న భిన్న ఎమోషన్స్‌ను ప్రతిబింబించేందుకు, ఆయన విభిన్న లుక్స్, బాడీ మేకోవర్‌ని అందుకున్నారు. సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, మరింత రిచ్ వాల్యూస్‌తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని యూనిట్ ప్రయత్నం చేసింది. ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికెట్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు యూత్ అండ్ కిడ్స్ కూడా ఈ సినిమాను ఆస్వాదించవచ్చు అని మేకర్స్ చెబుతున్నారు.