Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ ని భయపెట్టిస్తున్న సూర్య నిర్ణయం..!

కోలీవుడ్ స్టార్ సూర్య కంగువ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఐతే ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:47 AM GMT
ఫ్యాన్స్ ని భయపెట్టిస్తున్న సూర్య నిర్ణయం..!
X

కోలీవుడ్ స్టార్ సూర్య కంగువ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఐతే ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. శివ డైరెక్షన్ లో రూపొందించిన కంగువ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఐతే ఆ సినిమా ఫెయిల్యూర్ నుంచి వెంటనే తేరుకున్న సూర్య నెక్స్ట్ సినిమా మూడ్ కి వచ్చేశాడు. సూర్య 44వ సినిమా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్ల తర్వాత పూజా హెగ్దే సౌత్ లో అందుకున్న ఆఫర్ ఇదే.

ఇక ఈ సినిమా తర్వాత సూర్య 45వ సినిమా ఆర్.కె బాలాజి డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు. వీజేగా అలరించిన బాలాజీ డైరెక్టర్ గా కూడా సక్సెస్ అయ్యాడు. సూర్యతో బాలాజీ చేస్తున్న సినిమా పై ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఐతే ఈ సినిమా తెలుగు సినిమా స్పూర్తితో వస్తుందని టాక్. అది కూడా ఒక ఫ్లాప్ సినిమా కథను కాస్త అటు ఇటు మార్చి చేస్తున్నారని అంటున్నారు.

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా వీర. 2011 లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐతే బాలాజీ సూర్య కాంబో సినిమా కాస్త అటు ఇటుగా ఇలాంటి కథతోనే వస్తుందని అంటున్నారు. మరి రవితేజ సినిమా ఫ్లాప్ అని తెలిసినా సరే మళ్లీ అలాంటి ప్రయత్నమే అంటే ఈసారి ప్లానింగ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

సూర్య 45వ సినిమా ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకుని వారికి ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ సూర్యకు తెలుగులో కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారని తెలిసిందే. సూర్య చేసే ప్రతి సినిమా ఇక్కడ కూడా భారీగా రిలీజ్ అవుతాయి. గజిని సినిమా నుంచి సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సూర్య సినిమా అంటే అయన తెలుగు ఫ్యాన్స్ అలర్ట్ గా ఉంటారు. ఐతే కొన్నాళ్లు కొత్త ప్రయోగాలు, సామాజిక స్పృహ ఉన్న సినిమాలు చేసిన సూర్య ఇక మీదట ఫ్యాన్స్ కోరుకునే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే కార్తీక్ తో చేస్తున్న సినిమా కూడా ఫుల్ మాస్ అప్పీల్ తో వస్తుందని తెలుస్తుంది. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబో సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే బాలాజీ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ ఉంటుందని టాక్.