Begin typing your search above and press return to search.

రెట్రో కోసం సూర్య మాస్టర్ ప్లాన్..?

సూర్య లోని మాస్ మాత్రమే కాదు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని రెట్రోలో చూపించనున్నారు. రెట్రో గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేశారు.

By:  Tupaki Desk   |   14 March 2025 8:00 AM IST
రెట్రో కోసం సూర్య మాస్టర్ ప్లాన్..?
X

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువతో అంచనాలను అందుకోలేకపోయాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను శివ డైరెక్ట్ చేశారు. ఐతే ఆ సినిమా తో షాక్ తిన్న సూర్య నెక్స్ట్ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రెట్రో టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సూర్య వింటేజ్ లుక్ తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేయనున్నారు.

సూర్య రెట్రో ని భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా ఫ్యాన్స్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ సినిమాను 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సూర్యకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిందే.

గజిని సినిమా నుంచి సూర్య సినిమాలు తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఐతే ఈమధ్య సూర్య సినిమాలు తెలుగులో కూడా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోవట్లేదు. అందుకే రెట్రోతో తెలుగు ఆడియన్స్ కు దీన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలా తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట సూర్య అండ్ టీం. కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఇది తెలుగు ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. తెలుగులో ఈ సినిమాను సితార బ్యానర్ రిలీజ్ చేస్తుంది. అందుకే తెలుగులో ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారు.

సూర్య లోని మాస్ మాత్రమే కాదు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ని రెట్రోలో చూపించనున్నారు. రెట్రో గ్లింప్స్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేశారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఇవి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. సూర్య కొన్నాళ్లుగా డిఫరెంట్ సినిమాలు చేస్తూ మాస్ ఆడియన్స్ కు దూరంగా ఉంటూ వచ్చాడు. ఐతే రెట్రోతో తప్పకుండా మాస్ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.

సూర్య రెట్రో పాన్ ఇండియా లెవెల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మే 1న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.