Begin typing your search above and press return to search.

చెన్నైలో సూర్య.. ముంబైలో జ్యోతిక.. రీజన్ ఇదేనా..!

పెళ్లై పిల్లలు పుట్టాక నటనకు పూర్తిగా దూరమైన జ్యోతిక ఈమధ్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   29 Oct 2024 9:25 AM GMT
చెన్నైలో సూర్య.. ముంబైలో జ్యోతిక.. రీజన్ ఇదేనా..!
X

ఆన్ స్క్రీన్ మీదే కాదు ఆఫ్ స్క్రీన్ పై కూడా హీరో మెటీరియల్ అనిపించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ సూర్య ఉంటారు. రెండు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ స్టార్ గా ఎదిగిన సూర్య ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ బేస్డ్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న విషయం తెలిసిందే. పెళ్లై పిల్లలు పుట్టాక నటనకు పూర్తిగా దూరమైన జ్యోతిక ఈమధ్య మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి అలరిస్తున్నారు.

సూర్య జ్యోతికల అన్యోన్యత గురించి అందరికీ తెలిసిందే. ఐతే ప్రస్తుతం జ్యోతిక ముంబైకి షిఫ్ట్ అయ్యింది. దీనిపై మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. సూర్య జ్యోతిక విడిపోతున్నారు అంటూ కొందరు వార్తలు సృష్టించారు. ఐతే సూర్య కంగువ ప్రమోషన్స్ లో జ్యోతిక గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. 18 ఏళ్ల వయసులోనే జ్యోతిక చెన్నై వచ్చేసింది. పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీకే అంకితమైంది. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. తన స్నేహితులను, కెరీర్ ను కూడా కాదనుకుంది. మా ఫ్యామిలీ కోసం తన జీవన శైలి పూర్తిగా మార్చుకుంది.

ఐతే కొవిడ్ టైం తర్వాత మార్పు చేయాలని అనుకున్నాం. అందుకే తను ముంబై షిఫ్ట్ అయ్యింది. అక్కడకు వెళ్లాక కొత్త అవకాశాలు వస్తున్నాయి. మళ్లీ జ్యోతిక సినిమాల్లో నటిస్తుంది. అందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు సూర్య. తానేమో గొప్ప దర్శకులతో పనిచేయాలని చూస్తుంటే జ్యోతిక కొత్త దర్శకులతో పనిచేస్తుంది. పెళ్లైంది కదా అని మహిళలు వారికి నచ్చింది చేయకుండా ఉండకూడదు. చేయాల్సిన పని విషయంలో స్వాతంత్రం ఉండాలి. అందుకే జ్యోతిక తన స్నేహితులతో, బంధువులతో ఉండేందుకు ముంబైలో ఉంటుంది. షూటింగ్ లేని టైం లో ముంబైకి వెళ్తా.. నెలలో కనీసం 10 రోజులైనా ఫ్యామిలీకి కేటాయిస్తా అని చెప్పారు సూర్య.

ఒకసారి పెళ్లైతే ఇక మహిళల వ్యక్తిగతం అనేది ఏమి ఉండదు. అంతా భర్త చెప్పినట్టే చేయాలి.. ఆయనతోనే అన్నీ అని చెబుతుంటారు. ఐతే ఫ్యామిలీ కోసం అన్ని సాక్రిఫైజ్ చేసిన భార్యకు అవసరమైన టైం లో అవసరమైన స్వేచ్చ ఇవ్వాలి. అది భార్యాభర్తల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ ని బట్టి ఉంటుంది. సూర్య జ్యోతిక ఇద్దరు ఎంత అండర్ స్టాండింగ్ తో ఉన్నారన్నది చూస్తే అర్ధమవుతుంది.

మధ్యలో ఎవరో ఏదో అనుకున్నారని కాదు.. వారు చేస్తున్న పనుల మీద చాలా క్లారిటీతో ఉన్నారు కాబట్టే వారు ఈ డైవర్స్ రూమర్స్ మీద స్పందించలేదు. సూర్య ప్రస్తుతం కంగువ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది.