Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ సైలెంట్ గా ముగించేసిందే!

అప్ప‌టి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2024 5:17 AM GMT
బుట్ట‌బొమ్మ సైలెంట్ గా ముగించేసిందే!
X

ముంబై బ్యూటీ పూజాహెగ్డే చాలా గ్యాప్ త‌ర్వాత సూర్య 44వ చిత్రానికి హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్ అండ్ వార్ పిరియాడిక్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. తొలి షెడ్యూల్ అండ‌మాన్ లో ప్రారంభ‌మైంది. అప్ప‌టి నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో సూర్య గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర పోషిస్తున్నాడు.


గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌లు సూర్య‌కి కొత్తేం కాదు. విక్ర‌మ్ లో క్లైమాక్స్ లో గ్యాంగ్ స్ట‌ర్ గా న‌టించి సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రొలెక్స్ పాత్ర‌తో పాన్ ఇండియాలో వెలిగిపోయాడు దీంతో ఏకంగా రోలెక్స్ టైటిల్ తోనే ఓ సినిమా ప్ర‌క‌టించాడు సూర్య‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కార్తీక్ సుబ్బ‌రాజ్ సినిమాలోనూ గ్యాంగ్ స్ట‌ర్ అవ‌తారం ఎత్తాడు. ఇందులో సూర్య‌కి జోడీ పూజాహెగ్డే న‌టిస్తోంది. షూటింగ్ మొద‌లైన ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి ఆమె కూడా నిర్విరామంగా షూట్ లో హాజ‌ర‌వుతుంది.

అయితే తాజాగా ఆమె పాత్ర‌కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. ఈ విష‌యాన్ని అమ్మ‌డు స్వ‌యంగా రివీల్ చేసింది. ఓ మంచి సినిమాలో భాగ‌మైన‌ట్లు సంతోషం వ్య‌క్తం చేసింది. కానీ సినిమాలో త‌న పాత్ర ఎలా ఉంటుంది? ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అన్న వివ‌రాలు మాత్రం రివీల్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో ఉన్న ఒకే ఒక్క త‌మిళ చిత్ర‌మిది. ఈ సినిమాపై ఆశ‌లు భారీగానే పెట్టుకుంది. విజ‌య్ తో న‌టించిన `బీస్ట్` సినిమాతో త‌మిళంలో పాగా వేయాల‌ని చూసింది గానీ..ఆ సినిమా వైఫ‌ల్యంతో అవ‌కాశాలు రాలేదు.

ఇటు తెలుగులోనూ అవకాశాలు లేక ముంబై లోఉన్న స‌మ‌యంలో సూర్య‌-కార్తిక్ పిలిచి ఛాన్స్ ఇచ్చారు. మ‌రి ఈపాత్ర‌కు బుట్ట‌బొమ్మ ఎంత‌వ‌ర‌కూ న్యాయం చేస్తుందో చూడాలి. ఇటీవ‌లే యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కొత్త ప్రాజెక్ట్ కి కూడా ఈ భామ‌నే హీరోయిన్ గా ఫైనల్ చేసారు. గ‌తంలో అమ్మ‌డు చైత‌న్య‌తో ఒక లైలా కోసంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ లో అమ్మ‌డి డెబ్యూ అదే.