Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు మాట ఇచ్చి త‌ప్పారు..సూర్య సాధిస్తాడా!

తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య కూడా అభిమానుల‌కు ఓ ప్రామిస్ చేసారు. ఇక‌పై తాను కూడా ఏడాదికి రెండు సినిమాలతో క‌చ్చితంగా ప్రేక్ష‌కుల ముందుకొ స్తాన‌న్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2024 1:30 AM GMT
మ‌నోళ్లు మాట ఇచ్చి త‌ప్పారు..సూర్య సాధిస్తాడా!
X

ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తామ‌ని టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఎలా ఊద‌ర‌గొడ‌తారో చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానుల ముందుకొచ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఈ మాట క‌చ్చితంగా వినిపిస్తుంది. అభిమానుల‌కు-త‌మ‌కు మ‌ధ్య అంత‌రం పెరిగిపోతుంద‌ని అలా జ‌ర‌గ‌కూడ‌దు అంటే రెండు సినిమాలు రిలీజ్ చేస్తేనే ఆ గ్యాప్ త‌గ్గుతుందంటారు. ఇప్ప‌టికీ ఈ మాట‌లు దాదాపు స్టార్ హీరోలంతా చెప్పారు. కానీ ఏ హీరో ఏడాదికి రెండు సినిమాలు క‌చ్చితంగా రిలీజ్ చేసిన సంద‌ర్భం ఒక్క‌టీ లేదు.

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్, మ‌హేష్‌, బ‌న్నీ ఇలా స్టార్లు అంతా ఈ మాట చాలా సార్లు చెప్పారు. కానీ సాధ్య‌ప‌డ‌లేదు. ఇక ప్ర‌భాస్ ఒకే సారి అన్ని సినిమాల‌కు క‌మిట్ అవుతాడు. వాటిని అలాగే ప‌ట్టా లెక్కిస్తాడు. ఈ క్ర‌మంలో ఏడాది పాటు రిలీజ్ లు ఉండ‌వు. కానీ రిలీజ్ ల‌కు వచ్చాయి అంటే ఒకే ఏడాది షూట్ పూర్తిచేసిన చిత్రాల‌న్ని రిలీజ్ అవుతుం టాయి. కానీ ఇది ఎప్పుడో కాని చోటు చేసుకోదు. ఇక సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంక‌టేష్ కూడా ఏడాదికో సినిమా రిలీజ్ చేయ‌లేక‌పోతున్నారు.

కొన్నేళ్ల క్రితం సీనియ‌ర్లు రెండు..మూడు షిప్ట్ లు ప‌నిచేసేవారు. ఆ రోజుల్లో రిలీజ్ చేసేవారు. 50 దాట‌నంత కాలం వాళ్లంతా యాక్టివ్ గా సినిమాలు చేసిన వారే. తాజాగా కోలీవుడ్ స్టార్ సూర్య కూడా అభిమానుల‌కు ఓ ప్రామిస్ చేసారు. ఇక‌పై తాను కూడా ఏడాదికి రెండు సినిమాలతో క‌చ్చితంగా ప్రేక్ష‌కుల ముందుకొ స్తాన‌న్నారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'కంగువ' సినిమా కోసం ఆయ‌న చాలా స‌మ‌యం కేటాయించారు. భారీ ప్రాజెక్ట్ కావ‌డంతో రిలీజ్ కూడా ఆల‌స్య‌మైంది.

దీంతో గ్యాప్ వ‌చ్చింది. అయితే అభిమానుల కోరిక మేర‌కు ఇక‌పై ఆ గ్యాప్ ఉండ‌ద‌ని ప్రామిస్ చేసారు. మ‌రి సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం సూర్య 'రెట్రో'లో న‌టిస్తున్నారు. ఇది ఆయ‌న 44వ చిత్రం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ఏడాది 45వ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది.