Begin typing your search above and press return to search.

సినిమా కంటెంట్ చూడండి.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాదు.. హీరో సూర్య..

సినిమాలంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అందుకే మనకు ప్రతివారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 5:41 AM GMT
సినిమా కంటెంట్ చూడండి.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాదు.. హీరో సూర్య..
X

సినిమాలంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. అందుకే మనకు ప్రతివారం ఏదో ఒక కొత్త సినిమా థియేటర్లో సందడి చేస్తూనే ఉంటుంది. చిన్న సినిమా దగ్గర నుంచి పెద్ద సినిమా వరకు మనవాళ్లు బాగా ఆదరిస్తారు. అయితే గత కోతికాలంగా సినిమా సక్సెస్ను కేవలం బాక్సాఫీస్ కలెక్షన్స్ తో అంచనా వేస్తున్నారు అందరు. అయితే ఈ విధానం కరెక్ట్ కాదు అంటున్నారు హీరో సూర్య. ఈ మేరకు ఆయన ప్రేక్షకులకు ఓ చిన్న విన్నపం కూడా చేశారు.

సినిమా అంటే కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు కంటెంట్ ను కూడా చూడాలి అని సూర్య సినీ లవర్స్ ని ఉద్దేశించి మాట్లాడారు.’సినిమాలను ఇష్టపడే వారు ఎవరైనా సరే.. సినిమాని సినిమా లాగా చూడాలి. ఒక సినిమా అంటే అందులో కథ ఎలా ఉంది, కథనం ఎలా సాగుతోంది, మ్యూజిక్, ఎమోషన్స్, కామెడీ.. ఇలా ప్రతి కోణంలో సినిమా ఎంజాయ్ చేసే విధంగా ఉందా లేదా అని ఆలోచించాలి అంతేకానీ కేవలం బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద మాత్రమే మాట్లాడుకోవడం సరికాదు. మీరు ఒక అభిమానిగా సినిమాను సెలెబ్రేట్ చేసుకోండి.. చూసి ఎంజాయ్ చేయండి. అంతేకానీ సినిమాలో తప్పులేమున్నాయి అని వెతికి రాసే రివ్యూలపై ఎక్కువ దృష్టి పెట్టకండి’అని సూర్య అన్నారు.

సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని పలువురు సమర్థిస్తున్నారు కూడా. సినిమాని మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనే విషయాన్ని చూడకుండా పక్కన వాడి ఇచ్చిన రివ్యూ ని బట్టి చూడాల వద్ద అని డిసైడ్ అయ్యే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సందర్భంలో సూర్యా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ లవర్స్ ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. వేరేవాళ్ళ ఒపీనియన్ ని పరిగణలోకి తీసుకొని మనం సినిమాని ఆస్వాదించడం మానేస్తున్నాం అని పలువురు నెటిజెన్లు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కార్తీ,అరవింద్ స్వామి ప్రధాన పాత్రలలో సూర్య జ్యోతిక సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన మెయ్యళగన్ ఒక రాత్రిపూట జరిగే కామెడీ డ్రామా. ఇదే మూవీ సత్యం సుందరం పేరుతో తెలుగులో కూడా సెప్టెంబర్ 28 న విడుదల కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఆడియో లాంచ్ లో మాట్లాడిన సూర్య సినీ లవర్స్ సినిమాని సినిమాగా చూడాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.