సూపర్‌స్టార్ అని పిలవొద్దన్న హీరో
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియన్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Oct 2024 5:23 AMతమిళ స్టార్ హీరో సూర్య నటించిన పాన్ ఇండియన్ సినిమా `కంగువ` నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని యువిక్రియేషన్స్- స్టూడియోగ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయని ప్రచారమవుతోంది. ప్రస్తుతం టీమ్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ పై దృష్టి సారించింది. ఇటీవల ముంబయిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో స్టార్లకు సంబంధించిన 30 అడుగుల కటౌట్‌ను ప్రదర్శించారు. ఇది ముంబై పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. సూర్య, దర్శకుడు సిరుత్తై శివ, బాబీ డియోల్, దిశా పటాని ప్రచార కార్యక్రమంలో హైలైట్ అయ్యారు.
ఈ గ్రాండ్ హిస్టారికల్ డ్రామాతో ఉత్తరాదిన భారీగా మార్కెట్ పెంచుకోవాలని సూర్య ఉత్సాహంగా ఉన్నాడు. బాహుబలి స్టార్ ప్రభాస్, ఆర్.ఆర్.ఆర్ స్టార్లు చరణ్- ఎన్టీఆర్ తరహాలో కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూర్య చాలా కాలంగా ఉవ్విళ్లూరుతున్నాడు. ముఖ్యంగా సూర్య కస్ అంతా ఉత్తరాది ప్రచారంపైనే ఉందనడంలో సందేహం లేదు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్ తర్వాత `కంగువ` టీమ్ తమ ప్రమోషన్ కోసం ముంబైకి తిరిగి వచ్చారు. మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్‌తో ముంబైలో సినిమా ప్రమోషన్స్ పీక్స్‌కి చేరుకున్నాయి.
ముఖ్యంగా ప్రమోషన్స్ లో `కంగువ`లోని సూర్య - బాబీ డియోల్‌ల స్టిల్‌ను హైలైట్ చేస్తూ 30 అడుగుల కటౌట్‌ను ముంబైలోని ఒక వ్యాపార కేంద్రంలో ఉంచారు. ఈ భారీ బ్యానర్ పరిశ్రమ వర్గాల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ముంబైలో కంగువ టీమ్‌కి ఇది మరొక విజయవంతమైన ప్రచార కార్యక్రమం. మహానగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశంలో భారీ కటౌట్ ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందని అంచనా వేస్తున్నారు.
ప్రచార వేదికపై ఈ వినోదాత్మకమైన పీరియాడిక్ డ్రామా గురించి మాట్లాడిన హిందీ నటుడు బాబీ డియోల్ సూర్యను `సూపర్ స్టార్` అని కీర్తించాడు. అయితే సూర్య ఎంతో సూటిగా ఈవెంట్‌లో `సూపర్‌స్టార్` అనే పిలుపును నిరాకరించాడు. అతడు తన ఒదిగి ఉండే స్వభావాన్ని `కంగువ` వేదికపై మరోసారి ఆవిష్కరించాడు. అది అందరి మనసులను గెలుచుకుంది. సూర్య మాట్లాడుతూ `మాకు సూపర్‌స్టార్ అంటే ఎప్పుడూ రజనీ సార్. ఒకే ఒక్క సూపర్ స్టార్. మీరు ఒక వ్యక్తి నుండి ఒక పేరును తొలగించలేరు. అది ఏ ఇతర వ్యక్తికి బ్యాడ్జ్ కాకూడదు`` అని కూడా సూర్య వ్యాఖ్యానించారు. ఇక రజనీకాంత్ నటించిన వేట్టయ్యాన్ వీక్షించిన సూర్య ఆ సినిమాపై ఎంతో గొప్ప ప్రశంసలు కురిపించాడు. రజనీ పై తన ప్రేమను అభిమానాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. `సూపర్‌స్టార్` రజనీకాంత్‌పై సూర్యకు ఉన్న గౌరవం ఈ కార్యక్రమంలో అందరినీ మెప్పించింది.