హిట్ డైరెక్టర్ కి సూర్య నో..!
కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు.
By: Tupaki Desk | 18 Jan 2025 8:30 PM GMTకోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నుంచి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తారు. పది పదిహేనేళ్ల క్రితం గౌతం సినిమా అంటే చాలు అప్పటి యువతకి ఒక వైబ్ వచ్చేది. ఆయన డైరెక్షన్ లో సినిమా అంటే చాలు స్టార్స్ కూడా ఎగ్జైట్ అవుతుంటారు. ఐతే గౌతం మీనన్, సూర్య కాంబో అంటే మాత్రం అదో క్రేజీ కాంబో అన్న టాక్ పడిపోయింది.
ఇద్దరు కలిసి కాకా కాకా వరణం ఆయిరం సినిమాలు చేశారు. ఐతే సూర్యతోనే గౌతం మీనన్ ధృవనక్షత్రం సినిమా కూడా సూర్యతో చేయాలని అనుకున్నాడట. ముందు సూర్య దాదాపు ఓకే అన్నా సరే ఆ తర్వాత ఎందుకో సూర్య ఆ సినిమా చేయనన్నాడని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు గౌతం మీనన్. సూర్య కాదనడానికి రీజన్స్ ఏంటో తనకు అర్థం కాలేదని. సూర్య తనది సూపర్ హిట్ కాంబో అయినా అతనికి ఆ సినిమా చేయడం కుదరలేదని అన్నారు గౌత మీనన్.
ధృవనక్షత్రం సినిమా సూర్య కాదని చెప్పడంతో చియాన్ విక్రం తో తెరకెక్కించాడు గౌతం మీనన్. ఐతే ఆ సినిమా చాలా కాలం పాటు రిలీజ్ అవ్వకుండా ఉండే సరికి ఆడియన్స్ లో కూడా ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫైనల్ గా ధృవనక్షత్రం సినిమా సూర్య కాదని చెప్పాడని చెప్పి షాక్ ఇచ్చారు గౌతం మీనన్. ఆయన ఓపెన్ అయ్యే వరకు విక్రం చేసిన ఆ సినిమా సూర్య వద్దన్నాడని తెలియదు.
ఏది ఏమైనా తనకు రెండు సూపర్ హిట్ సినిమాలను అందించిన గౌతం మీనన్ తో సూర్య ఈ సినిమా చేయకపోవడానికి కారణాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. గౌతం మీనన్ ఈమధ్య డైరెక్షన్ వదిలి యాక్టర్ గా సెటిల్ అయ్యారు. ఆయన డైరెక్షన్ లో సినిమా చూసిన ఫ్యాన్స్ మళ్లీ ఆయన్ని డైరెక్టర్ గా చూడాలని అనుకుంటున్నా ఆయన మాత్రం నటుడిగానే కొనసాగాలని ఆసక్తిగా ఉన్నారు. సూర్య ఈమధ్యనే కంగువ సినిమాతో వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు. దీనితో పాటుగా ఆర్.జె బాలాజి డైరెక్షన్ లో సినిమా కూడా ఫిక్స్ చేసుకున్నాడు.