Begin typing your search above and press return to search.

ఆ క్రేజీ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తారా..?

రెట్రో సినిమా చివర్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుందట. రెట్రో క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఉంటుందని టాక్.

By:  Tupaki Desk   |   3 April 2025 5:30 PM
ఆ క్రేజీ సినిమా క్లైమాక్స్ ట్విస్ట్ ఇస్తారా..?
X

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు డైరెక్టన్ లో రెట్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య కార్తీక్ సుబ్బరాజు కాంబోలో క్రేజీ మూవీపై అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ యువ దర్శకుడిగా కార్తీక్ తీసిన సినిమాలు అతని టాలెంట్ ఏంటన్నది తెలిసేలా చేసింది. ఐతే రెట్రో తో సూర్య మార్క్ మాస్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు.

ఈ సినిమా కథ సూర్యని ఇంప్రెస్ చేసిందట. సూర్య బలంగా నమ్ముతున్న కథ అని తెలుస్తుంది. అందుకే నిర్మాతగా కూడా మరెవరో ఎందుకు అని సూర్య తన 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెట్రో సినిమాలో వింటేజ్ సూర్య ని చూడబోతున్నారని టీజర్ తోనే చూపించారు. ఒకప్పటి మాస్ సూర్య ఈసారి రెట్రో గా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు.

టీజర్ కట్ లో సూర్య వింటేజ్ షేడ్స్ ఫ్యాన్స్ కి సూపర్ జోష్ అందించాయి. డైరెక్టర్ కార్తీక్ సినిమా లకు ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది. అందుకే రెట్రో టీజర్ తోనే ఒక క్రేజీ బజ్ ఏర్పడేలా చేశారు.

ఇదే కాకుండా రెట్రో సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటించడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అమ్మడు సినిమాలో ఉంది అంటే గ్లామర్ విషయం లో డోకా లేదన్నట్టే లెక్క. ఐతే రెట్రో టీజర్ లో పూజా బేబ్ హోమ్లీ లుక్ బాగున్నా ఫ్యాన్స్ కి కావాల్సిన గ్లామర్ సినిమాలో ఉంటుందని తెలుస్తుంది.

ఇక ఇప్పటికే రెట్రో నుంచి రిలీజ్ అయిన ఒక సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. సాంగ్ తో సినిమా పై ఒక గ్రేట్ వైబ్ తెచ్చారు మేకర్స్. ఐతే లేటెస్ట్ గా రెట్రో నుంచి మరో షాకింగ్ న్యూస్ లీక్ అయ్యింది. రెట్రో సినిమా చివర్లో ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుందట. రెట్రో క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఉంటుందని టాక్.

అంటే రెట్రో సినిమా కూడా బాహుబలి, పుష్ప తరహాలో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం సూర్య ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క. సూర్య రెట్రో పై అంచనాలు ఉన్నా కూడా సినిమా ని చాలా సైలెంట్ గా పూర్తి చేశారు. అంతేకాదు సినిమాలో అసలు కంటెంట్ ఏంటన్నది రివీల్ చేయకుండా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట.

మే 1 పాన్ ఇండియా లెవెల్ లో సూర్య రెట్రో రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా పై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలు ఎంతవరకు నిజం అవుతాయన్నది చూడాలి.