సూర్య 'రెట్రో' టీజర్.. తెలుగు సౌండ్ మొదలైంది
ప్రమోషన్స్ లో భాగంగా శనివారం ఉదయం తెలుగు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
By: Tupaki Desk | 8 Feb 2025 6:25 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇప్పుడు రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి అవ్వగా.. త్వరలోనే మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే భారీ బడ్జెట్ తో 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన రెట్రో మూవీ.. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన రెట్రో సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేశారు. కానీ తమిళ భాషలోనే తీసుకొచ్చారు.
ప్రమోషన్స్ లో భాగంగా శనివారం ఉదయం తెలుగు టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్ తో టైటిల్ టీజర్ స్టార్ట్ అయింది. "కోపం తగ్గించుకుంటా, మా నాన్న దగ్గర పని చేయడం మానేస్తాను..రౌడీయిజం, తగాదాలు అన్నీ ఈ క్షణం నుండి మానేస్తాను.. నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను" అని సూర్య చెబుతారు.
ఆ తర్వాత వేరే లెవెల్ యాక్షన్ సీన్స్ ను చూపించగా.. అందులో ఇంటెన్స్ లుక్ లో సూర్య సందడి చేశారు. ఆ తర్వాత.. "నా ప్రేమ, పవిత్రమైన ప్రేమ.. ఇప్పుడు చెప్పవే.. మనం పెళ్లి చేసుకుందామా?" అని పూజను సూర్య అడుగుతారు. ఆమె సరే అని తల ఊపుతూ చెబుతుంది. అనంతరం స్వాగ్ తో సూర్య సిగరెట్ తాగిన షాట్ తో టీజర్ ఎండ్ అయింది.
అయితే ఇప్పటికే తమిళ టీజర్ చూసేసినా.. ఇప్పుడు తెలుగులో వచ్చాక కూడా అంతా మరోసారి టాలీవుడ్ మూవీ లవర్స్ ఆస్వాదిస్తున్నారు. లవ్, యాక్షన్ తో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెబుతున్నారు. సినిమాపై అంచనాలు పెరిగాయని అంటున్నారు. కచ్చితంగా మూవీ మంచి హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
టీజర్ లో సూర్య లుక్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. పూజా లుక్ పై విమర్శలు వచ్చినా నేచురల్ లుక్ లో ఆకట్టుకుంటుందనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ టేకింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. బాగా సెట్ అయింది. మరి సమ్మర్ కానుకగా రానున్న రెట్రో మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.