Begin typing your search above and press return to search.

రోలెక్స్ సీక్రెట్స్ రివీల్ చేసిన సూర్య

సూర్య మాట్లాడుతూ, రోలెక్స్ పాత్రలో నటించడానికి వెనకున్న ఆలోచనలను వివరించాడు. “అది నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు.

By:  Tupaki Desk   |   30 Oct 2024 6:26 AM GMT
రోలెక్స్ సీక్రెట్స్ రివీల్ చేసిన సూర్య
X

సౌత్ ఇండియాలో టాలెంటెడ్ స్టార్ హీరోగా ఉన్న సూర్య ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడానికి కంగువ సినిమాతో దూసుకెళ్తున్నాడు. ముంబైలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఈ సినిమాను ఉత్తరాదిలో విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఇటీవల కంగువ ప్రమోషన్ లో పాల్గొన్న సూర్య, తన క్రేజ్‌కి బూస్ట్ ఇచ్చిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. సూర్య మాట్లాడుతూ, రోలెక్స్ పాత్రలో నటించడానికి వెనకున్న ఆలోచనలను వివరించాడు. “అది నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజు. ఆ రోజు నాకు స్క్రిప్ట్ ఇవ్వలేదు, కేవలం సెట్ కు రాగానే సీన్ వివరించారన్నారు.

నేను చాలా టెన్షన్ గా ఉన్నాను. ఆ రోజు కేవలం హాఫ్ డే షూట్ ప్లాన్ చేసుకున్నాం. ఆ సీన్ కోసం డైరెక్టర్ లోకేష్, టీం మొత్తం సెట్ రెడీ చేసింది. ఆ తర్వాత లోకేష్ నన్ను పిలిచి సీన్ ఏం చేయాలో వివరించారు,” అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు తెరపై పొగ త్రాగడం ప్రోత్సహించకుండా ఉండాలనే తన నియమాన్ని రోలెక్స్ పాత్ర కోసం అతిక్రమించినట్లు సూర్య వెల్లడించాడు.

“నేను ఎప్పుడూ తెరపై పొగ త్రాగనని మాట ఇచ్చుకున్నాను. కానీ నేను రోల్ లో విలన్ గా ఉన్నప్పుడు, సూర్యగా ఉన్న ఆస్తిత్వాన్ని ఎందుకు తెచ్చుకోవాలి? అందుకే, ఈసారి ఆ పాత్రకు తగ్గట్టు స్మోక్ చేశాను,” అని సూర్య వివరించాడు. ఈ పాత్రకు ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదని, ఆ సీన్ తీయడాన్ని అంతే త్వరగా పూర్తి చేయాలని అనుకున్నానని, ఎందుకంటే కమల్ సర్ ముందు నటించలేను అని చెప్పాడు.

కమల్ హాసన్ ప్రొడక్షన్ లో నటించడం తనకు ఒక డ్రీమ్ నెరవేరినట్లు అని, లోకేష్ కనగరాజ్ తో పని చేయడం తనకు ఒక గొప్ప అనుభవంగా మారిందని సూర్య అన్నారు. రోలెక్స్ పాత్రపై సోలో సినిమా చేసే ఆలోచన కూడా నేడు మరింత బలపడిందని వెల్లడించాడు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కంగువ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు.