Begin typing your search above and press return to search.

సూర్య 45 కి పవన్‌ మూవీతో సంబంధం ఏంటి?

ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న 'రెట్రో' సినిమా తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించబోతున్నాడు

By:  Tupaki Desk   |   7 March 2025 11:00 PM IST
సూర్య 45 కి పవన్‌ మూవీతో సంబంధం ఏంటి?
X

తమిళ్‌ స్టార్‌ హీరో సూర్యతో ఆర్జే బాలాజీ ఒక సినిమాకు సిద్ధం అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం కార్తీక్‌ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేస్తున్న 'రెట్రో' సినిమా తర్వాత సూర్య నుంచి రాబోతున్న సినిమాకు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిందని, త్వరలోనే సినిమా షూటింగ్‌ ప్రారంభించి, టైటిల్‌ను సైతం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తమిళ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సూర్య తో ఆర్జే బాలాజీ రూపొందించబోతున్న సినిమా ఫాంటసీ కథ అని, ఇందులో దేవుడి పాత్ర ఉంటుందని కోలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తుంది.

నయనతారతో మూకుతి అమ్మన్‌ 2 సినిమాను చేయాల్సిన ఆర్జే బాలాజీ కొన్ని కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. నయనతార కోసం రెడీ చేసుకున్న సినిమా కథను మార్పులు చేర్పులు చేసి సూర్య వద్దకు ఆర్జే బాలాజీ తీసుకు వెళ్లాడట. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథను కాస్త హీరో సెంట్రిక్‌ ఫిల్మ్‌గా మల్చడంతో పాటు, పలు కమర్షియల్‌ ఎలిమెంట్స్ జోడించి కథను రెడీ చేశారట. ఆర్జే బాలాజీ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో సూర్య డ్యూయెల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఒక సూర్య దేవుడి పాత్రలో కనిపించబోతుండగా, మరో సూర్య పాత్రను లాయర్‌గా చూడబోతున్నామట.

పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌లు కలిసి నటించిన 'గోపాల గోపాల' సినిమాకు ఈ సినిమాతో సంబంధం ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. కథ విషయంలో పూర్తి విభిన్నమైనవి అయినా కూడా పవన్ దేవుడిగా భూమి మీదకు రావడం, వెంకటేష్‌ కోర్టులో వాదించడం వంటివి చేస్తాడు. సూర్య 45 సినిమాలో దేవుడు కొన్ని కారణాల వల్ల భూమి మీదకు వస్తాడు. ఆ దేవుడి పాత్రను సూర్య పోషించబోతున్నాడు. ఇక దేవుడి తరపున కోర్టులో వాదించే లాయర్‌ పాత్రను సైతం సూర్య పోషించబోతున్నాడు. కథ సింపుల్‌ అయినా దర్శకుడు ఆర్జే బాలాజీ చూపించే విధానం ఆకట్టుకుంటుంది అనే విశ్వాసంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేసే సూర్య నుంచి ఈసారి విభిన్నమైన సినిమా రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఆర్జే బాలాజీ దర్శకుడిగా ఇప్పటికే మంచి పేరును సొంతం చేసుకున్నాడు. కనుక ఈ సినిమాతో దర్శకుడిగా మరో విజయాన్ని ఆయన సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో వైపు ఈ సినిమా కథకు నయనతార నటిస్తున్న మూకుతి అమ్మన్‌ 2 సినిమా కథకు దగ్గరి పోలికలు ఉంటాయని కోలీవుడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు విడుదల కానుందా అనేది ఆసక్తిగా మారింది. కథలు రెండు సేమ్‌ ఉంటే కోలీవుడ్‌లో కొత్త రచ్చకు తెర లేచే అవకాశాలు ఉన్నాయి.