Begin typing your search above and press return to search.

భార్య సంపాద‌న త‌న‌కంటే ఎక్కువ‌ని అంగీక‌రించిన హీరో

త‌మిళ స్టార్ హీరో సూర్య- అగ్ర క‌థానాయిక‌ జ్యోతిక వివాహమై దాదాపు 18 ఏళ్లు అవుతోంది.

By:  Tupaki Desk   |   11 Nov 2024 3:33 AM GMT
భార్య సంపాద‌న త‌న‌కంటే ఎక్కువ‌ని అంగీక‌రించిన హీరో
X

త‌మిళ స్టార్ హీరో సూర్య- అగ్ర క‌థానాయిక‌ జ్యోతిక వివాహమై దాదాపు 18 ఏళ్లు అవుతోంది. ఈ జంట దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో పాపుల‌ర్ స్టార్లు. ఇటీవ‌ల సూర్య పాన్ ఇండియా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అదే స‌మ‌యంలో పిల్ల‌ల‌తో క‌లిసి ముంబైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేయ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్ర‌స్తుతం సూర్య న‌టించిన కంగువ చిత్రాన్ని పాన్ ఇండియాలో విడుద‌ల చేసేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

కంగువలో సూర్య గిరిజన నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ద‌రువు శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మధ్యయుగ కాలానికి సంబంధించిన క‌థ‌తో రూపొందింది. బాబీ డియోల్, దిశా పటాని ఇందులో ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా తాజా ప్ర‌చార‌ ఇంట‌ర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. తన భార్య జ్యోతిక పెద్ద స్టార్ గా ఉన్న‌ప్పుడు సినీ పరిశ్రమలో తాను ఆరంభ క‌ష్టాల్లో ఉన్నాన‌ని తెలిపారు.

జ్యోతిక అప్పటికే తన కంటే మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు తాను కలిశానని సూర్య మషబుల్‌తో ఇంటరాక్షన్‌లో మాట్లాడాడు. జ్యోతికతో కలిసి నటిస్తున్నప్పుడు తన పాత్రను కూడా సరిగ్గా పోషించలేకపోయానని అన్నాడు. అప్పటికి త‌ను పెద్ద నటిగా స్థిరపడింద‌ని తెలిపాడు. హిందీలో డోలీ సజా కే రచన తర్వాత జ్యోతిక తన మొదటి తమిళ చిత్రంలో నాతో కలిసి పనిచేసింది. ఆమె రెండో సినిమా నాతో. ఆ తర్వాత మేము మంచి స్నేహితులం అయ్యాం. పరస్పర గౌరవం ఏర్పడింది. నాకు తమిళం తెలుసు.. నేను నటుడి కొడుకని అనుకున్నాను.. కానీ నేను తడబడ్డాను.. నా డైలాగులను కూడా మరచిపోయాను. ఎలా నటించాలో తెలియలేదు. అప్ప‌టికి మూడు నాలుగు సినిమాలే చేసాను. నేను ఆమె పని నీతిని నిజంగా గౌరవించాను. త‌నకు సెట్లో డైలాగులు ఏమిటో త‌న‌కు స్ప‌ష్ఠంగా తెలుసు. ఆమె డైలాగ్స్ ని నాకంటే బాగా నేర్చుకుంది. న‌టిగా పూర్తిగా నిజాయితీగా ఉంది.. అని తెలిపాడు.

ఒక నటుడిగా తమిళ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులను, మార్కెట్‌ను కనుగొనడానికి తనకు చాలా సంవత్సరాలు పట్టిందని చెప్పాడు. అప్ప‌టికే జ్యోతిక విజ‌యంతో దూసుకెళ్లింది. న‌టుడిగా స్థిరపడటానికి నాకు ఐదు సంవత్సరాలు పట్టింది. నన్ను నేను హీరో అని పిలుచుకోవ‌డానికి.. సొంత‌ మార్కెట్‌ను పొంద‌డానికి నాకు కొంత సమయం పట్టింది. కాఖా కాఖా చిత్రంలో జ్యోతిక పారితోషికం నా కంటే మూడు రెట్లు ఎక్కువ... అని తెలిపాడు. ఆ సమయంలో నేను జీవితంలో ఎక్కడ ఉన్నానో కూడా గ్రహించాను. నేను ప్ర‌పోజ్ చేసాక‌.. నా జీవితంలో భాగం కావడానికి జ్యోతిక సిద్ధ‌మైంది. ఆమె తల్లిదండ్రులు కూడా అంగీకరించారు.

ముంబైకి అందుకే షిఫ్టింగ్:

దాదాపు 27 ఏళ్ల పాటు చెన్నైలో కలిసి గడిపిన జ్యోతిక, సూర్య ముంబైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో వారు ముంబైకి వెళ్లారు. చాలా ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అని అదే ఇంటర్వ్యూలో సూర్య చెప్పాడు. జ్యోతిక కుటుంబం ముంబయిలో ఉందని.. వారికి దూరంగా చాలా కాలం గడిపిన తర్వాత వారికి సన్నిహితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. జ్యోతికకు 18 ఏళ్లు అప్ప‌టి నుంచి త‌న సొంత‌ నగరం విడిచిపెట్టి 27 ఏళ్లు నాతో పాటు చెన్నైలో ఉన్నారు. కాబట్టి ఆమె తన తల్లిదండ్రులతో గడపడం సరైనదని నేను అనుకున్నాను. పిల్లలు ఐబి ప్రోగ్రామ్‌ను ఎంచుకున్నారు. చెన్నైలో దీని కోసం ఒకటి లేదా రెండు పాఠశాలలు మాత్రమే ఉన్నాయి అని ఆయన వివరించారు. ముంబైకి తాను కొత్త‌వాడిని అని అంద‌రినీ ప‌రిచ‌యం చేసుకోవాల్సి ఉంద‌ని కూడా సూర్య ఈ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించ‌డం విశేషం.