Begin typing your search above and press return to search.

బాలయ్యతో సూర్య సర్‌ప్రైజ్

దీంతో బాలయ్య ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:55 AM GMT
బాలయ్యతో సూర్య సర్‌ప్రైజ్
X

ఏజ్ పెరుగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. ఫ్లాపులు వచ్చినా అస్సలు పట్టించుకోని ఆయన.. ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉండడంతో ఫుల్ జోష్‌తో ముందుకు సాగుతున్నారు. ఇలా వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. దీంతో బాలయ్య ఏమాత్రం తీరిక లేకుండా గడుపుతున్నారు.

నందమూరి బాలకృష్ణ ఆరంభం నుంచే ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో రంగాల్లో తనదైన మార్కును చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ అనే టాక్ షోతో ఓటీటీలోకి హోస్టుగా అడుగు పెట్టారు. ఆహా సంస్థ రూపొందించిన ఈ షో ఎన్నో అంచనాల నడుమ వచ్చింది. అందరి నమ్మకాలను నిలబెట్టుకుంటూ ఈ షోకు భారీ రెస్పాన్స్‌తో సూపర్ సక్సెస్ అయిపోయింది.

టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్టుగా వచ్చిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో మొదటి సీజన్ భారీ స్పందనను అందుకుని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. దీంతో ఆహా టీమ్ రెండో సీజన్‌తో పాటు మూడో దాన్ని కూడా సక్సెస్‌ఫుల్‌గా నడిపించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నాలుగో సీజన్‌ను తీసుకు వస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే వచ్చింది.

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోకు సంబంధించిన నాలుగో సీజన్‌కు సంబంధించి ప్రకటన రావడంతో దీనిపై ఎన్నో రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇందులో పాల్గొనే గెస్టుల గురించి కూడా చాలా వార్తలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి స్టార్ హీరోలు కూడా పాల్గొంటున్నారని అంటున్నారు.

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం కాబోతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షో నాలుగో సీజన్‌లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా పాల్గొనబోతున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అతడు నటించిన తాజా చిత్రం ‘కంగువా’ ప్రమోషన్స్‌లో భాగంగానే ఈ సినిమా టీమ్ మొత్తం బాలయ్యతో సందడి చేయబోతుందట. ఈ ఎపిసోడ్‌ను అక్టోబర్ 24వ తేదీన షూట్ చేయబోతున్నారని కూడా తెలిసింది.

నందమూరి బాలయ్య నడిపించబోయే ‘అన్‌స్టాపబుల్’ షోకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గెస్టుగా వస్తున్నాడన్న వార్త ఇప్పుడు తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో ఈ ఎపిసోడ్‌పై అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి ఇందులో వీళ్లిద్దరూ కలిసి ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచబోతున్నారో చూడాలి.