Begin typing your search above and press return to search.

ఒక వైపు హిట్‌ కాంబో.. మరో వైపు భార్య భర్త

ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ కపుల్‌ అయిన ఫహద్‌ ఫాసిల్‌ మరియు ఆయన భార్య నజ్రియా లు కనిపించబోతున్నారు. సూర్యకు జోడీగా నజ్రియా కనిపించబోతుంది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 6:59 AM GMT
ఒక వైపు హిట్‌ కాంబో.. మరో వైపు భార్య భర్త
X

కరోనా సమయంలో సూర్య నుంచి వచ్చిన సూపర్ హిట్‌ మూవీ ఆకాశమే నీ హద్దురా. ఆ సినిమాకు తెలుగు మహిళా దర్శకురాలు అయిన సుధా కొంగర దర్శకత్వం వహించారు. ఆ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డుల వరకు కూడా మేకర్స్ వెళ్లడం జరిగింది. తమిళ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఆ సినిమాకు జనాల నుంచి ఆదరణ లభించింది.

అప్పటి నుంచి వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది... వచ్చేందుకు రెడీ అవుతోంది అంటూ ప్రచారం జరిగింది. ఎట్టకేలకు సూర్య అధికారికంగా తన 43వ సినిమా గా సుధా కొంగర దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో నటించబోతున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల విషయంలోనూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాకు పలు ఆసక్తికర విషయాలు జత కలిశాయి. ముఖ్యంగా ఇది ఒక సూపర్‌ హిట్‌ కాంబో కాగా సంగీత దర్శకుడు జీవి ప్రకాష్‌ కుమార్ కి ఇది 100వ సినిమా. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ కపుల్‌ అయిన ఫహద్‌ ఫాసిల్‌ మరియు ఆయన భార్య నజ్రియా లు కనిపించబోతున్నారు. సూర్యకు జోడీగా నజ్రియా కనిపించబోతుంది.

చాలా సంవత్సరాల తర్వాత నజ్రియా మరియు ఫహద్‌ లు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. అయితే ఇద్దరు జంటగా కాకుండా సంబంధం లేని పాత్రల్లో కనిపించబోతున్నారు. సూర్య సినిమాలో నటించే అవకాశం రావడంతో నజ్రియా మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పిందని టాక్‌. అంతే కాకుండా ఫహద్‌ కూడా మంచి పాత్ర అవ్వడంతో కమిట్ అయ్యాడని తెలుస్తోంది.

1970 లో జరిగిన సంఘటనల ఆధారంగా తయారు అయిన కథ తో ఈ సినిమాను దర్శకురాలు సుధ కొంగర చేయబోతుందని తెలుస్తోంది. హిందీ వ్యతిరేక ఉద్యమ బ్యాక్ డ్రాప్‌ లో ఈ సినిమా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కథ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే లేదు. కానీ సుధ మరో సూపర్‌ హిట్ ను సూర్య కు ఇవ్వబోతుందని చాలా మంది నమ్ముతున్నారు.