Begin typing your search above and press return to search.

సూర్య 44.. వ్వాటే క్యాస్టింగ్

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:08 AM GMT
సూర్య 44.. వ్వాటే క్యాస్టింగ్
X

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 మూవీ తెరకెక్కబోతోంది. తాజాగా ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ చిత్ర యూనిట్ ప్రకటించింది. స్టూడియో గ్రీన్, 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ఈ మూవీ రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ ని తాజాగా ఎనౌన్స్ చేశారు. మూవీలో సూర్యకి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఖరారు అయ్యింది. రాధేశ్యామ్ తర్వాత పూజా హెగ్డే సౌత్ లో చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. లవ్ లాఫర్ వార్ థీమ్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోందంట. ఇక మూవీలో కీలక పాత్ర కోసం మలయాళీ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఫైనల్ చేశారు. అలాగే మలయాళీ స్టార్ జయరాం మరో ఇంటరెస్టింగ్ రోల్ చేయబోతున్నారంట.

తమిళ్ కమెడియన్ కరుణాకరన్ ని కూడా ఈ మూవీ కోసం ఎంపిక చేశారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించబోతున్నారు. సూర్య, పూజా హెగ్డే కాంబినేషన్ కావడంతో కచ్చితంగా ఆన్ స్క్రీన్ రొమాన్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీ తర్వాత కార్తిక్ సుబ్బరాజు నుంచి ఈ మూవీ వస్తోంది. సూర్యకి కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మూవీ ఎప్పుడు షూటింగ్ మొదలవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ ఏడాదిలోనే చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉందంట. ఇదిలా ఉంటే మరో వైపు సూర్య కంగువ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ లో తన ఇంపాక్ట్ చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. అలాగే కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా కంగువ నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

సూర్య లైన్ అప్ లో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. బీస్ట్ మూవీ తర్వాత పూజా హెగ్డే తమిళంలో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రంపై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది.