చరణ్-సూర్య కలయిక ఇప్పట్లో సాధ్యమేనా?
ఒకప్పుడు ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించేది. అదే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ గా మారింది.
By: Tupaki Desk | 8 May 2024 3:30 PM GMTపాన్ ఇండియాలో మల్టీస్టారర్ చిత్రాల హవా మూములుగా లేదిప్పుడు . `ఆర్ ఆర్ ఆర్` తో చరణ్-ఎన్టీఆర్ నటించి సంచలనం సృష్టించిన నాటి నుంచి మళ్లీ ఆ వేవ్ తీసుకురావడానికి మరింత మంది స్టార్లు చేతులు కలిపారు. ధనుష్- నాగార్జున కలిసి `కుభేర` లో నటిస్తున్నారు. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ కలిసి `వార్ -2` తో చేతులు కలిపారు. `కల్కీ` లో ఎంతో మంది స్టార్లు భాగమయ్యారు. ప్రభాస్..కమల్ హాసన్..అమితాబచ్చన్ ఇలా స్టార్లు అంతా కలిసి చేసిన సినిమా ఇది.
ఒకప్పుడు ఈ కల్చర్ ఎక్కువగా బాలీవుడ్ లో కనిపించేది. అదే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ గా మారింది. మనోళ్లు ఏకంగా ఇండియాన్ మార్కెట్ నే టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- కోలీవుడ్ స్టార్ సూర్య కూడా చేతులు కలుపుతున్నట్లు మరోసారి ప్రచారంలోకి వచ్చింది. ఇద్దరు కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారని..ఆ చిత్రాన్ని `కంగువ` దర్శకడు శివ తెరకెక్కిస్తారని ప్రచారం సాగుతోంది.
`కంగువ` తర్వాత శివ చేయబోయే సినిమా ఇదేనంటూ ఒక్కసారిగా కథనాలు వెడెక్కిస్తున్నాయి. ప్రస్తుతం సూర్యతో కంగువ తెరకెక్కిస్తోన్న నేపథ్యం...ఆ సినిమాపై ఉన్న అంచనాలతో ఈ కాంబో తెరపైకి రావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. చరణ్..సూర్య లాంటి ఇద్దరు బిగ్ స్టార్లు చేతులు కలిపితే ఎలా ఉంటుందన్నది చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో అది సంచలనమే అవుతుంది. అయితే సాధ్యాసాధ్యాలు ఎంతవరకూ అంటే! అదం ఈజీ కాదన్నది గుర్తించాలి.
ఆ ఇద్దరు ఇమేజ్ ని బేస్ చేసుకుని కథ రాయాలి. అదీ పాన్ ఇండియా లో అంటే ఆ స్టోరీ ఎంతో యూనిక్ గా ఉండాలి. ఇద్దరు పాన్ ఇండియాలో ఇమేజ్ ఉన్న స్టార్లు కాబట్టి ఎంతో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. `ఆర్ ఆర్ ఆర్` సినిమాతో చరణ్-ఎన్టీఆర్ ని ఒకే తెరపైకి తీసుకురావడనికి కొన్నేళ్లు సమయం పట్టింది. విజయేంద్ర ప్రసాద్ ఆ కథ రాయడం కోసం ఎంతో శ్రమించారు. ఏడాదిలో రాసి ఆరు నెలల్లో పూర్తి చేసిన సినిమా కాదు. `కుభేర` కథ కోసం శేఖర్ కమ్ములా రెండేళ్లు కుర్చున్నాడు.
`లవ్ స్టోరీ` తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినా చేయకుండా కథపైనే వర్క్ చేసాడు. ఇక ఎన్టీఆర్..హృతిక్ ని కలపడం కోసం బ్యాకెండ్ చాలా కాలంగా వర్క్ జరిగితే అది 2024 లో సాధ్యమైంది. అయితే కోలీవుడ్ దర్శక-రచయితలకి మిగతా భాషలకి చెందిన రచయిత దర్శకులకి చాలా వ్యత్యాసం ఉంది. కథలు రాయడంలో కోలీవుడ్ అనుభవం ఎంతో ప్రత్యేకమైనది. వాటి కోసం పెద్దగా సమయం తీసుకోరు. మరి శివ అంత చురుకుగా ప్లాన్ చేస్తున్నాడా? లేదా? అన్నది తెలియాలి.