Begin typing your search above and press return to search.

సూర్య ను తిట్టిన రఘువరన్‌..!

తమిళ స్టార్‌ సూర్య కెరీర్‌ ఆరంభంలో నటన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.

By:  Tupaki Desk   |   23 July 2024 1:30 PM GMT
సూర్య ను తిట్టిన రఘువరన్‌..!
X

తమిళ స్టార్‌ సూర్య కెరీర్‌ ఆరంభంలో నటన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం తండ్రి కారణంగానే సూర్యకు ఆఫర్లు వస్తున్నాయి. వారసత్వంతో వచ్చిన సూర్య కు కెరీర్ ఆరంభంలో పెద్ద ఆఫర్లు వచ్చాయి.. కొన్ని హిట్ అయినా కూడా నటన విషయంలో చాలా సార్లు విమర్శలు చవిచూశాడు.

సూర్య చాలా పట్టుదలతో నటనతో పాటు అన్ని రంగాలపై పట్టు సాధించి సూపర్‌ స్టార్‌ అయ్యాడు. నేడు సూర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు తమిళ మీడియా ప్రధానంగా ప్రస్తావిస్తూ కథనాలను రాయడం జరిగింది. అందులో సూర్య మరియు రఘువరన్ మధ్య జరిగిన సంఘటన ఒకటి ఉంది.

చాలా ఏళ్ల క్రితం సూర్య మరియు రఘువరన్ ఒకే రైలు లో ప్రయాణం చేస్తున్నారు. రైలు ప్రయాణ సమయంలో సూర్య నిద్ర పోతున్నప్పుడు రఘువరన్ వెళ్లి నిద్ర లేపి మరీ 'ఎలా నీకు నిద్ర పడుతుందిరా... ఇంకా ఎన్నాళ్లు నీ తండ్రి పేరును వాడుకుని ఇండస్ట్రీలో కొనసాగుతావు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడట.

ఆ సమయంలో రఘువరన్ తనను తిట్టినా కూడా ఫీల్ అవ్వకుండా పట్టుదలతో నటుడిగా రాటు తేలాడు. చాలా అద్భుతమైన నటుడిగా తనకు తాను ప్రేక్షకుల ముందు నిరూపించుకున్నాడు. అంతే కాకుండా పాన్ ఇండియా స్టార్‌ హీరోగా కూడా సూర్య పేరు సొంతం చేసుకున్నాడు.

ఇప్పటి వరకు పలు అవార్డులను మరియు రివార్డులను సొంతం చేసుకున్న సూర్య తన తండ్రి వారసత్వంగా వచ్చిన అవకాశాలను చేసుకుంటూ వెళ్తే ఈ రోజు ఇలా ఉండేవాడు కాదు. సొంతంగా తనకంటూ గుర్తింపు కోసం పోరాటం చేసిన సూర్య కచ్చితంగా ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.